అన్వేషించండి
Seethe Ramudi Katnam Serial Today March 25: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత తన తండ్రిపై చేయిచేసుకోవడానికి కారణమేంటి..? మిథునను మహాలక్ష్మీ పూర్తిగా నమ్మినట్లేనా..?
Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మీ వాళ్లను నమ్మించడానికి మిథున రూపంలోఉన్న సీతే వాళ్ల నాన్నపై చేయిచేసుకుంటుంది. ఆ తర్వాత పరిణామాలను ఈరోజు ఏపిసోడ్‌లో చూద్దాం.

సీతే రాముడి కట్నం సీరియల్ టుడే ఎపిసోడ్
Source : ZEE
Seethe Ramudi Katnam Serial Today Episode Seethe Ramudi Katnam Serial Today Episode: శివకృష్ణను చెంపదెబ్బ కొట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామ్...మిథునపై చేయి ఎత్తుతాడు. శివకృష్ణ అతన్ని ఆపుతాడు. నా కూతురు రూపంలో ఉన్న సీతే కొట్టిందనుకుంటానని చెబుతాడు. ఆడపిల్లపై చేయిచేసుకోవడం మంచిది కాదని చెబుతాడు. సీత అయితే ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయదని అంటాడు. మిథున శివకృష్ణను కొట్టడంతో మహాలక్ష్మీ, అర్చన ఇద్దరూ సంబరపడిపోతారు. తాను ఖచ్చితంగా మిధుననే అనుకుంటారు. మిథున తరఫున రామ్ శివకృష్ణకు సారీ చెప్పడంతో సీత లోలోపల సంతోషిస్తుంది.
మిథున: ఆ తండ్రీ కూతుళ్ల వల్ల మీ కుటుంబానికి ఇంత నష్టం జరిగినా...నువ్వు ఇంకా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావా రామ్..? నీకు షేమ్ అనిపించడం లేదా..?
రామ్: షేమ్‌గా ఫీల్ అవ్వాల్సింది నువ్వు.. గెస్ట్‌గా వచ్చి మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావ్...అమెరికాలో చదువుకుని ఏం లాభం..సంస్కారం లేని చదువు వల్ల ఉపయోగం లేదు
మహాలక్ష్మీ: సారీ మిథున...ఆ సీత వాళ్ల నాన్న వచ్చి నీ మూడ్ మొత్తం పాడు చేశాడు. అతని రాకతో నువ్వు మా ఇంటికి వచ్చిన హ్యాపీనెస్ మొత్తం పాడైపోయింది.
అర్చన: నువు ఆ శివకృష్ణకు భలే ఇచ్చావ్ మిథున....నువ్వు అసలు అతన్ని కొడతావని అసలు ఎక్స్ఫర్ట్ చేయలేదు.
మిధున: మా డాడ్‌ను ఇన్సల్ట్ చేస్తే నేను ఎలా వదిలిపెడతాను. అసలు ఇలాంటి వాళ్లను ఇంట్లోకి రానివ్వకూడదు
మహాలక్ష్మీ: మేం కూడా అదేపనిలో ఉన్నాం మిథున...ఆ సీతను పర్మినెంట్‌గా ఈ ఇంటి నుంచి తరిమేస్తే...ఇలాంటి వాళ్లు ఎవరూ ఈ ఇంటికి రారు.
మిధున: నేను వాళ్లను తిడుతుంటే...రామ్‌కు ఎందుకు కోపం వస్తుంది..
అర్చన: రామ్ వాళ్ల అమ్మ సుమతి...స్వయానా ఆ శివకృష్ణ చెల్లెలు. సీతకు మేనత్త ..మేనమామను అనడం వల్లే కోపం వచ్చి ఉంటుుంది.
మిధున: రామ్‌కు ఇంకా సీతపైన ప్రేమ ఉంది...మరి పర్మినెంట్‌గా ఎలా కట్ చేస్తారుయ
మహాలక్ష్మీ: రామ్‌కు సీతపై ప్రేమ ఉంది..కోపం కూడా ఉంది. మెల్లగా ఆ ప్రేమను కట్ చేసి కోపం పెరిగిపోయేలా చేస్తాం. ఆటోమేటిగ్‌గా రామ్ సీతకు డైవర్స్ ఇస్తాడు
మిథున చేతిలో చెంపదెబ్బతిన్న శివకృష్ణ అవమానభారంతో కిరణ్ వాళ్ల ఇంటికి వస్తాడు. సీత ఎక్కడని అడగ్గా...మీతోపాటే వచ్చింది కదా అని వాళ్లు అంటారు. శివకృష్ణ ఒక్కడే బాధపడటం చూసి కిరణ్, రేవతి వాళ్లు ఆరా తీస్తారు..మహాలక్ష్మీ ఏమైనా అవమానించిందా అని అడుగుతారు. లేదమ్మా ఆ ఇంట్లో నేను ఒకరిని చూశానని...ఆమె అచ్చం మన సీతలాగే ఉందని శివకృష్ణ చెబుతాడు. మనుషులను పోలిన వాళ్లు ఇంకొకరు ఉంటారని చెబితే వినడమే గానీ చూడటం ఇదే ఫస్ట్‌టైం అని అంటాడు. కాకపోతే మన సీత పల్లెటూరులో పెరిగి పద్దతిగా ఉంటే.. ఆ మిథున మాత్రం చాలా పొగరుగా ఉందని చెబుతాడు. తనకు సీతకు అసలు పోలిక లేదని....ఆమె అచ్చం మహాలక్ష్మీలాగే ఉందంటాడు. పొగరు, గర్వం ఎక్కువ ఉందని అంటాడు. ఈలోగా టీ తీసుకొస్తానని లోపలకి వెళ్లి రేవతి వెంటే కిరణ్ కూడా వెళ్తాడు. మిథున గెటప్‌లోఉన్న సీతను చూసి శివకృష్ణ అన్నయ్య చాలా బాధపడుతున్నాడని....ఇప్పుడు మిథున వేషంలోనే సీత ఇక్కడి వస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని కిరణ్ అంటాడు. సీత ముందే నిజం చెప్పిఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు.
ఈలోగా సీత అక్కడికి వచ్చి శివకృష్ణను చూసి మీరు ఇంకా ఊరికి వెళ్లలేదా అని అడుగుతుంది. సీత తన గెటప్‌లోనే రావడంతో రేవతి,కిరణ్ ఊపిరి పీల్చుకుంటారు. ఇంటికి వెళ్లిపోదామనే బయలుదేరాను కానీ మనసు బాగా లేక నీ దగ్గరకు వచ్చానని శివకృష్ణ అంటాడు. పిల్లల చేతిలో దెబ్బలు తినడం ఏ తండ్రికైనా భారమేనని...ఇప్పుడు ఇదే బాధ నేను అనుభవిస్తున్నానని అంటాడు. దీంతో వారంతా షాక్‌కు గురవుతారు. చిన్నప్పుటి నుంచి ఈ చేతులపై పెంచిన కూతురు వేషం,భాష మార్చి మరొకరిలా నటిస్తుంటే మాత్రం కన్నతండ్రి కనుక్కోలేడా తల్లీ అని అనడంతో ...సీత ఒక్కసారిగా కన్నీటితో అతని కాళ్లపై పడుతుంది. బిడ్డ చేతి స్పర్శ తండ్రికి తెలియకుండా ఉంటుందా అని శివకృష్ణ అంటాడు. నీ చేయి నా చెంపకు తగిలినప్పుడే అది నువ్వేనని అర్థమైందంటాడు శివకృష్ణ. నన్ను
క్షమించమంటూ సీత కాళ్లపై పడి ఏడ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం





















