అన్వేషించండి

Satya Dev Bollywood Debut: బాలీవుడ్‌లోకి సత్యదేవ్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన హిందీ స్టార్ హీరో!

ప్రముఖ టాలీవుడ్ హీరో సత్యదేవ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రామ్ సేతు సినిమాలో సత్యదేవ్ నటిస్తున్నాడు.

టాలీవుడ్ హీరో సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ్ సేతు’ చిత్రంలో సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అధికారికంగా తన ట్వీటర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్.. ముగ్గురూ ఉన్న ఫొటోను అక్షయ్ షేర్ చేశారు. రామ్ సేతు సినిమాకు సంబంధించి ఊటీ షెడ్యూల్ పూర్తి అయిందని తెలిపారు.

రామ్ సేతు సినిమా 2022 అక్టోబర్ 24వ తేదీన విడుదల కానుంది. అజయ్-అతుల్ ద్వయం ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్వహిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ అనే పాత్రలో అక్షయ్ కుమార్, సీత అనే పాత్రలో జాక్వెలైన్ ఫెర్నాండెజ్, లక్ష్మణ్ అనే పాత్రలో సత్యదేవ్, ఊర్మిళ అనే పాత్రలో నుస్రత్ బహుచా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతుందా.. లేదా మరేదైనా కల్పిత కథా అనేది తెలియరాలేదు.

ఇక అక్షయ్ కుమార్ చేతిలో ప్రస్తుతం ఎన్నో సినిమాలు ఉన్నాయి. సూర్యవంశీ, అత్రంగి రే, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, మిషన్ సిండ్రెల్లా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. రామ్ సేతు, ఓఎంజీ 2 సినిమాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సూర్యవంశీ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. కరోనా కాలంలో రెండు సినిమాలు విడుదల చేస్తున్న ఏకైక బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమారే. బెల్ బాటం ఇప్పటికే విడుదలైంది. థియేటర్లలో ఈ సినిమాకు అంత రెవిన్యూ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు సూర్యవంశీ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ కోసం ఎన్నో పాన్ ఇండియా సినిమాలు ఎదురు చూస్తున్నాయి.

సత్యదేవ్ ఇటీవలే తిమ్మరుసుతో హిట్ కొట్టాడు. గుర్తుందా శీతాకాలం, గాడ్సే, రామ్ సేతు, స్కైలాబ్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, గాడ్సే, స్కైలాబ్ ఈ సంవత్సరమే విడుదలయ్యే అవకాశం ఉంది. సత్యరాజ్ గతంలో నవాబ్ సినిమాలో శింబుకు, సాహోలో నీల్ నితిన్ ముకేష్‌కు. ఆకాశం నీ హద్దురాలో సూర్యకు డబ్బింగ్ కూడా చెప్పాడు.

Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..

Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget