Sarpatta Round 2: సెకండ్ రౌండ్‌కు ‘సార్పాట్ట’ రెడీ - అధికారికంగా ప్రకటించిన టీమ్!
2021లో వచ్చిన ఓటీటీ బ్లాక్‌బస్టర్ ‘సార్పాట్ట పరంపర’కు సీక్వెల్‌ను ప్రకటించారు.
2021లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘సార్పాట్ట పరంపర’ ఓటీటీలోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళనాడులో జరిగే స్ట్రీట్ బాక్సింగ్ టోర్నమెంట్‌ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. ‘సార్పాట్ట రౌండ్ 2’ పేరిట ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పా. రంజిత్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. కానీ దాదాపుగా మొదటి భాగంలో నటించిన తారాగణమే కనిపించే అవకాశం ఉంది.
ఆర్యకు ‘సార్పాట్ట పరంపర’ తర్వాత మరో హిట్ దక్కలేదు. ‘అరణ్మనై 3’, విలన్‌గా నటించిన ‘ఎనిమీ’, ‘కెప్టెన్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేశాయి. ప్రస్తుతం ‘కతార్ బాషా ఎండ్ర మురుగేశన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత మరే సినిమాకు కమిట్ అవ్వలేదు. కాబట్టి ఈ సినిమా తర్వాత ‘సార్పాట్ట రౌండ్ 2’ ఉండే అవకాశం ఉంది.
‘సార్పాట్ట పరంపర’ తర్వాత దర్శకుడు పా.రంజిత్ ‘నచ్చత్రం నగర్‌గిరదు’ అనే సినిమాతో సైలెంట్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం విక్రమ్‌తో మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ‘తంగలాన్’ షూటింగ్‌లో ఉంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇది కూడా పీరియాడిక్ సినిమానే. స్వాతంత్రానికి ముందు జరిగిన సంఘటన నేపథ్యంలో కథ సాగనుంది.
‘సార్పాట్ట పరంపర’ థియేటర్లలో విడుదల అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని అప్పట్లో అందరూ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో ఒక్కో పాత్రకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా డ్యాన్సింగ్ రోజ్ పాత్ర ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.
Match பாக்க ready-யா? ரோஷமான ஆங்கில குத்துச்சண்ட🥊 Round 2️⃣#Sarpatta2 விரைவில்😎😍😍
— Arya (@arya_offl) March 6, 2023
A @beemji film @officialneelam #TheShowPeople @NaadSstudios #JatinSethi @kabilanchelliah @pro_guna @gobeatroute pic.twitter.com/z00LlbFq5B
Hear the sound of the bell? That's the mark for round 2️⃣ 🔥
— Neelam Productions (@officialneelam) March 6, 2023
Brace yourself for #Sarpatta2 🥊❤️🔥
A @beemji film 💙@arya_offl #TheShowPeople @NaadSstudios #JatinSethi @kabilanchelliah @pro_guna @gobeatroute pic.twitter.com/ZyuGZ8yk5a
Time for Round 2 🥊 #SarpattaParambarai Round 2 starring @arya_offl #SarpattaRound2 rolls soon; to release in cinemas; directed by @beemji ; produced by @NaadSstudios @officialneelam #TheShowPeople @SETHIJATIN #PARanjith #Arya pic.twitter.com/3m24pD3aYW
— Komal Nahta (@KomalNahta) March 6, 2023
பெரும் கொண்டாட்டத்திற்கு தயாராகுங்கள் மக்களே...!
— Guna (@pro_guna) March 6, 2023
சார்பட்டா பரம்பரை -2
Hear the sound of the bell? That's the mark for round 2️⃣! 🔥
Brace yourself for #Sarpatta2 🥊
A @beemji film 💙@arya_offl @officialneelam #TheShowPeople @NaadSstudios #JatinSethi @gobeatroute @pro_guna pic.twitter.com/r3HFoNf0Hd