అన్వేషించండి

Sarkaru vari Paata: సర్కారు... సంక్రాంతికి రావట్లేదు, కొత్త విడుదల తేదీ ఇదే!

దర్శకధీరుడు రాజమౌళి కోసం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మరోసారి త్యాగం చేశారు. 'సర్కారు వారి పాట' సినిమా వాయిదా వేశారు. సమ్మర్ టార్గెట్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.

సంక్రాంతి బరి నుంచి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తప్పుకొన్నారు. తన సినిమా, పరశురామ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.‌ జనవరిలో కాకుండా... ఏప్రిల్ నెలలో 'సర్కారు వారి పాట' విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. దీపావళి సందర్భంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయాలని అనుకున్నారు.‌ రిలీజ్ డేట్ ప్రకటించారు కూడా! అప్పటికి 'ఆర్ఆర్ఆర్' సంక్రాంతి సీజన్ లో లేదు. పోయిన విజయదశమికి విడుదల చేయాలనుకున్నారు. అయితే... ఉత్తర భారతదేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విడుదల వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతికి వారం ముందు జనవరి 7న విడుదల చేయాలని నిర్ణయించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'కు భారీ సంఖ్యలో థియేటర్లు అవసరం అవుతాయి. రెండో వారం కూడా సినిమా ఆడితే తప్ప... బడ్జెట్ రికవరీ కావడం కష్టం.‌ 'ఆర్ఆర్ఆర్' విడుదలైన వారంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' థియేటర్లలోకి రానుంది. మహేష్ కూడా తన సినిమాతో వస్తే... 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల పై ప్రభావం ఉంటుంది. అందుకని, సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సిందిగా మహేష్ బాబును రాజమౌళి రిక్వెస్ట్ చేశారట. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేష్ హీరోగా రాజమౌళి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ తో మహేష్ సినిమాను వాయిదా వేశారు.

రాజమౌళి కోసం ఈ విధంగా మహేష్ త్యాగం చేయడం ఇది రెండోసారి.‌ గతంలో 'బాహుబలి' పార్ట్ వన్ కోసం 'శ్రీమంతుడు' విడుదల వాయిదా పడింది. మహేష్ బాబు, కొరటాల శివ కలయికలో తెరకెక్కిన 'శ్రీమంతుడు'ను తొలుత జూలై 17న విడుదల చేయాలని అనుకున్నారు. 'బాహుబలి'ని జూలై 10న విడుదల చేస్తున్నామని, రెండవ వారం తమకు థియేటర్ల దగ్గర వెసులుబాటు ఇవ్వాలని మహేష్ బాబును 'బాహుబలి' దర్శకనిర్మాతలు రాజమౌళి శోభు యార్లగడ్డ రిక్వెస్ట్ చేయడంతో... 'శ్రీమంతుడు'ను ఆగస్టు 7కు వాయిదా వేశారు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి 'భీమ్లా నాయక్' కూడా వాయిదా పడే అవకాశం ఉందని వినిపించినా... తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ

Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October1: కోర్టులో జేడీ,కేడీకి చుక్కెదురు..చివరి నిమిషంలో కోర్టులో అబద్ధం చెప్పిన సాక్షులు
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో జేడీ,కేడీకి చుక్కెదురు..చివరి నిమిషంలో కోర్టులో అబద్ధం చెప్పిన సాక్షులు
Bigg Boss Season 10 Today Promo 3: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: అపూర్వని ఆట నుంచి తీసేసిన త్రిగుణ్‌! గేమ్ మధ్యలో దద్దరిల్లిన హౌస్‌!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: అపూర్వని ఆట నుంచి తీసేసిన త్రిగుణ్‌! గేమ్ మధ్యలో దద్దరిల్లిన హౌస్‌!
Jayasudha Love Always : ఓటీటీలోకి జయసుధ ఎంట్రీ - రొమాంటిక్ వెబ్ సిరీస్ లవ్ ఆల్వేస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి జయసుధ ఎంట్రీ - రొమాంటిక్ వెబ్ సిరీస్ లవ్ ఆల్వేస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sigma Reviews : 'సిగ్మా'పై నెగిటివ్ రివ్యూస్, ట్రోలింగ్స్ - హీరో సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్
'సిగ్మా'పై నెగిటివ్ రివ్యూస్, ట్రోలింగ్స్ - హీరో సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Embed widget