అన్వేషించండి

Sana Khan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘మిస్టర్ నూకయ్య’ హీరోయిన్ సనా ఖాన్

బాలీవుడ్ మాజీ నటి సనా ఖాన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సనా ఖాన్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Sana Khan: బాలీవుడ్ మాజీ నటి సనా ఖాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ భామ 2020లో అనాస్ సయ్యద్ను పెళ్లి చేసుకుంది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ దంపతులు తల్లిదండ్రలు కాబోతున్నామని ప్రకటించారు. తాజాగా సనా ఖాన్ బుధవారం(జూన్ 5)న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.  తమకు బాబు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది సనా. అందులో.. ‘‘అల్లాహ్.. మా బిడ్డ కోసం మమ్మల్ని ఉత్తమ తల్లిదండ్రులుగా మార్చుగాక. మీ ప్రేమ, దీవెనలు మాపై ఉంచాలని అందర్నీ కోరుకుంటున్నాం. ప్రతీ ఒక్కరినీ అల్లా కాపాడుతాడు’’ అంటూ రాసుకొచ్చింది. దానితో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సనా ఖాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. 

గతంలోనే ప్రకటించిన సనా ఖాన్..

సినిమాల నుంచి విరామం చెప్పిన తర్వాత సనా ఖాన్ పెద్దగా బయట కనిపించడం లేదు. పెళ్లి తర్వాత అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాలో మాత్రం పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే తాను తల్లి అయిన విషయాన్ని మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సనా. తాము తమ మొదటి సంతానాన్ని కుటుంబంలోకి స్వాగతించడానికి సిద్దంగా ఉన్నామని, బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అప్పటి వరకూ వేచి ఉండలేకపోతున్నాను అంటూ ఉద్వేగానికి లోనౌతూ చెప్పుకొచ్చింది సనా. ఇప్పుడు ఆ శుభతరుణం రానే వచ్చింది. సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ దంపతులకు శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అభిమానులకు షాక్ ఇచ్చిన సనా.. 

సనా ఖాన్ కెరీర్ పీక్స్ లో ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. అక్టోబర్ 8, 2020లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అది చూసి ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. తాను ఇకపై సినిమాలలో నటించనని ప్రకటించింది. తాను దైవసాక్షాత్కారం పొందానని, ఒక నుంచి ఆధ్యాత్మిక సేవలో ఉంటానని చెప్పుకొచ్చింది. సనా స్టేట్మెంట్ బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అంతే కాదు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమాలకు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసింది సనా. అప్పటికే ఆమెకు నెట్టింట మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత నెల నవంబర్ లో ఆమె ముఫ్తీ అనాస్ సయిూద్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది సనా. 

తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది సనా..

సనా ఖాన్ మోడల్ గా కెరీర్ ను ప్రారభించింది. తర్వాత పలు యాడ్ ఫిల్మ్ లలో నటించింది. 2005 లో వచ్చిన హిందీ సినిమా ‘యో హై హై సొసైటీ’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సనా. హిందీతో పాటు తమిళం సినిమాలలో ఎక్కువగా నటించింది. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2010లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాలో నటించింది. తర్వాత ‘గగనం’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించింది. తర్వాత ‘మిస్టర్ నూకయ్య’, ‘గజ్జెల గుర్రం’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి సినిమాల్లో నటించింది సనా ఖాన్.

Also Read: దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరో - గుండు లుక్‌తో షాక్ - D50 అనౌన్స్‌మెంట్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today April 1st: నిండు మనసులు: ప్రేరణ మెడలో తాళి కట్టేసిన సిద్ధూ! అదిరిపోయిన వార్నింగ్!
నిండు మనసులు: ప్రేరణ మెడలో తాళి కట్టేసిన సిద్ధూ! అదిరిపోయిన వార్నింగ్!
Prabhas: ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... 'బైకర్'కు ప్రభాస్ సపోర్ట్
ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... 'బైకర్'కు ప్రభాస్ సపోర్ట్
Gunde Ninda Gudi Gantalu April1st Episode: చిన్నప్పుడు మనోజ్ చేసిన నేరాన్ని బయటపెట్టిన బాలు, రోహిణికి బిగ్ షాక్ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 1 ఎపిసోడ్
చిన్నప్పుడు మనోజ్ చేసిన నేరాన్ని బయటపెట్టిన బాలు, రోహిణికి బిగ్ షాక్ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 1 ఎపిసోడ్
Tovino Thomas: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో నటించడం లేదు... కన్ఫర్మ్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్
ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో నటించడం లేదు... కన్ఫర్మ్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
YSRCP Amaravathi: రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?
రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?
Ippasara Anirudh Reddy: ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
Iran Target Tech Companies: ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 
ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 
Embed widget