Samantha: స్పై క్యారెక్టర్‌లో సమంత - ట్రైనింగ్ కోసమే అమెరికాకు వెళ్లిందట!
సమంత అమెరికా వెళ్లడానికి అసలు కారణమేంటంటే..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.
కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని వార్తలొచ్చాయి. కానీ అసలు విషయం అది కాదట. సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 'సిటాడెల్'కు రీమేక్ గా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. రుస్సో బ్రదర్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్, డీకే ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత స్పై పాత్రలో కనిపించనుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు ఉన్నాయట. అందులో సమంత నటించాల్సి ఉంది. అందుకే సమంత ప్రస్తుతం అమెరికాలో నిపుణుల సమక్షంలో తన పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంటుంది. కఠినమైన డైట్ ను ఫాలో అవుతుందట. ఈ ప్రాజెక్ట్ పై పూర్తిగా ఫోకస్ చేయడంతో.. ఆమె సోషల్ మీడియాలో దూరంగా ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలానే 'యశోద', 'శాకుంతలం' సినిమాలకు రూ.2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. అంతకంటే తక్కువ ఆఫర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట.
'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత రెమ్యునరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సమంత కూడా చేరబోతోంది.
'యశోద' టీజర్ కి క్రేజీ రెస్పాన్స్:
సమంత నటించిన 'యశోద' సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'యశోద' సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందని టాక్.
Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?
Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?