Salaar Movie Review Live Updates - 'సలార్' లైవ్ అప్డేట్స్: ప్రభాస్ సినిమా ప్రత్యేకతలు ఏంటి? - లైవ్ రివ్యూ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి
Salaar review live updates: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 2023లో ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూసిన చిత్రమిది. ఈ సినిమా రివ్యూ, లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
హైదరాబాద్ శ్రీ రాములు థియేటర్లో ఒంటి గంటకు 'సలార్' స్పెషల్ ప్రీమియర్ షో వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకి నిఖిల్ 100 టికెట్లు తీసుకున్నారు. ప్రభాస్ వీరాభిమానులకు ఇచ్చారు. వాళ్ళను కలిసి టికెట్లతో పాటు ఫోటోలు కూడా ఇచ్చారు.
ప్రేక్షకులందరూ ఇప్పుడు ఎదురు చూసే విషయం ఒకటే! బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను సలార్ మూవీ బ్రేక్ చేస్తుందా? లేదా? అని! దర్శక ధీరుడు రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రభాస్ ఆ స్థాయి విజయం అందుకోలేదు. కానీ ప్రెసెంట్ అడ్వాన్స్ సేల్స్ బుకింగ్ ట్రైన్ చూస్తుంటే బాహుబలి 2 రికార్డులు చాలా ఏరియాలలో బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Salaar Review Telugu Live Updates: 'సలార్' ప్రదర్శించనున్న థియేటర్లలో పండగ వాతావరణం మొదలైంది. మాస్ జాతర షురూ చేశారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఆ సందడి ఎలా ఉందో ఏబీపీ దేశం యూట్యూబ్ ఛానల్ లైవ్ లో చూడండి.
ఇండియాలో 'సలార్' క్రేజ్ ఎలా ఉంది? అనేది చెప్పడానికి జస్ట్ ఇదొక చిన్న ఎగ్జాంపుల్. బుధవారం రాత్రి వరకు కేవలం ఇండియాలో 30 లక్షల టికెట్లు అమ్మారు. పీవీఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఈ రోజు సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మిగతా థియేటర్లు యాడ్ చేస్తే రేపు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం ఖాయం.
పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో 'సలార్' టికెట్ బుకింగ్స్ గురువారం రాత్రి ఓపెన్ చేశారు. అయితే... అంతకు ముందు చాలా గొడవ జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అవి పుకార్లు మాత్రమేనని పీవీఆర్ ఐనాక్స్ సంస్థలు పేర్కొన్నా... బాలీవుడ్ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం పీవీఆర్ యజమానికి షారుఖ్ ఫోన్ చేశారట!
Also Read: 'సలార్'కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ - చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!
తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ఒక్కసారిగా వేలాది, లక్షలాది మంది యాప్ ఓపెన్ చేయడంతో కాసేపు పని చేయలేదు. క్రాష్ అయ్యింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి!
Also Read: 'సలార్' దెబ్బకు బుక్ మై షో క్రాష్ - ఇదీ ప్రభాస్ రేంజ్
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన 'డంకీ' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. రేపు 'సలార్' రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల ప్రీ సేల్స్ కంపేర్ చేస్తే... ఎవరిది పైచేయి? అడ్వాన్స్ కలెక్షన్స్ రూపంలో ఎవరి సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి? అనేది ఒక్కసారి చూడండి.
Also Read: సలార్ వర్సెస్ డంకీ - అడ్వాన్స్డ్ సేల్స్ కంపేరిజన్ చూడండి
తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే... అంతకు ముందు కొన్ని థియేటర్లలో కౌంటర్ దగ్గర టికెట్స్ అమ్మారు. వీలైనంత ఎర్లీగా ఫస్ట్ డే సినిమా చూడాలని రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు థియేటర్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. వాళ్ళలో కొందరు పోలీసుల చేతిలో తన్నులు తిన్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - 'సలార్' టికెట్స్ కోసం ప్రేక్షకుల తిప్పలు
Salaar pre release business break even target: 'బాహుబలి 1' తర్వాత ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడూ రూ. 200 కోట్లకు తగ్గలేదు. ప్రతి సినిమాకు రేంజ్ పెరుగుతూ వెళుతోంది. ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారు? వంటి వివరాల్లోకి వెళితే..
Also Read: ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?
'ఉగ్రమ్' కథకు స్ఫూర్తితో 'సలార్' తీశానని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఆ రెండు సినిమాల మధ్య పోలికలు ఏంటి? 'సలార్' ట్రైలర్, 'ఉగ్రమ్' సినిమాల మధ్య కంపేరిజన్స్ ఏంటి? అనేది చూడండి.
Also Read: 'సలార్' ట్రైలర్... 'ఉగ్రమ్' సినిమా... కొత్త డౌట్స్ - నిన్నటి వరకు ప్రశాంత్ నీల్ మోసం చేశారా?
Salaar special shows theaters list in hyderabad: థియేటర్లలో 'సలార్' హంగామా మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. మిడ్ నైట్ ఒంటి గంట నుంచి హైదరాబాద్ సిటీలో కొన్ని థియేటర్లలో షోలు వేస్తున్నారు. ఆ థియేటర్స్ లిస్ట్, ఇంకా ఏపీ & తెలంగాణలో టికెట్ రేట్లు ఎంత పెంచారు? వంటి వివరాల కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
Also Read: ప్రభాస్ సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపునకు ఓకే
'సలార్' సినిమాలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఓ రోల్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారంటీ అని ఆయన చెబుతున్నారు. సప్తగిరి చెప్పిన వివరాలు చదివేందుకు కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు, 'సలార్' గురించి సప్తగిరి ఏమన్నాడో తెలుసా?
'సలార్' సినిమాలో నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర చేశారు. 'పొగరు'తో పాటు కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమెకు రీ ఎంట్రీ చిత్రమిది. సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్న శ్రియా రెడ్డి ఈ సినిమా చేయడానికి కారణం ఏమిటి? అనేది ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ!
Also Read: కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్'
Also Read: ‘సలార్’ మూవీకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, పైగా లాభాల్లో వాటా కూడానట!
Salaar Review - First Trailer: 'సలార్' సినిమాకు రెండు ట్రైలర్స్ విడుదల చేశారు. అందులో మొదటి ట్రైలర్ మూడు నిమిషాలు ఉంది. ఆ ట్రైలర్ రివ్యూను ఇక్కడ చూడండి.
Also Read: 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
భారీ సినిమాలు అన్నిటికీ లీక్స్ కామన్ అవుతున్న రోజులు ఇవి! ముఖ్యంగా అవుట్ డోర్ షూటింగ్స్ చేసినప్పుడు షూటింగ్ చూడటానికి వచ్చిన ఎవరో ఒకరు మొబైల్ ఫోనుల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సెట్స్ నుంచి వీడియోస్ కూడా లీక్ కావడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటో తెలుసుకోవడం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
వెండితెర మీద మాత్రమే కాదు... నిజ జీవితంలోనూ ప్రభాస్ బాహుబలి అంత మనసు ఉన్న మంచి మనిషి అని ఆయన సన్నిహితులు చెబుతారు. ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెబుతారు. 'సలార్'కు పని చేసిన వాళ్ళు అయితే చిత్రీకరణలో తమకు ఇచ్చిన బహుమతి గురించి చెప్పారు.
'సలార్' బృందానికి ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి: ప్రభాస్ మంచి మనసు - ‘సలార్‘ సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్
Background
Salaar Movie Release Review Live Updates: భారతీయ సినిమా బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా 'సలార్'. ఇందులో ప్రముఖ మలయాళ కథానాయకుడు, దర్శక నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్ జోడీగా అగ్ర కథానాయిక, లోక నాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ నటించారు.
ప్రభాస్ అభిమానులకు క్రిస్మస్, న్యూ ఇయర్ ముందుగా మొదలు!
Salaar release hungama: 'సలార్' విడుదల అవుతున్న థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ముంబైలో ఓ థియేటర్ దగ్గర 150 అడుగుల ఎత్తున్న కటౌట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ థియేటర్ల దగ్గర హడావిడి చూస్తుంటే... అభిమానులకు క్రిస్మస్ & న్యూ ఇయర్ ముందుగా వచ్చాయని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా రివ్యూ, లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
'కెజియఫ్ 2' తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి...
'సలార్' సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. కన్నడ కథానాయకుడు యశ్ పాన్ ఇండియా స్టార్ కావడం వెనుక కారణమైన 'కెజియఫ్', 'కెజియఫ్ 2' చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆ రెండు సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ కన్నడ నిర్మాత విజయ్ కిరగుందూర్ ఈ 'సలార్'ను కూడా నిర్మించారు.
'సలార్' విడుదలకు ముందు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అయితే... ఆ ప్రభావం ఈ సినిమా మీద పడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్, ఆ టికెట్ సేల్స్ చూస్తుంటే భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తోంది.
'సలార్' సినిమాకు, 'కెజియఫ్'కు లింక్ ఉందని మొదట నుంచి ప్రచారం జరిగింది. అయితే... అందులో నిజం లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు అని, తనకు సినిమాటిక్ యూనివర్స్ తీసేంత స్థాయి లేదన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే... 'ఉగ్రం' రీమేక్ అంటూ జరిగిన ప్రచారాన్ని తొలుత ఖండించినప్పటికీ, విడుదల దగ్గర పడిన తరుణంలో నిజమేనని ఆయన అంగీకరించారు. 'కెజియఫ్' తరహాలో 'ఉగ్రం' కథను తీశామని ఆయన పేర్కొన్నారు.
Salaar Cast and Crew Names: 'సలార్' సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. ఆ సినిమాలో ఆమెది ముస్లిం పాత్ర అయితే... ఈ సినిమాలో హిందూ పాత్ర. రెండిటిలో ఆమె ఉండటంతో, రెండు సినిమాల మధ్య లింక్ ఉందని ప్రచారం జరిగింది. ఇక... రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు హీరో జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, టినూ ఆనంద్, కన్నడ నటుడు మధు గురుస్వామి నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -