అన్వేషించండి

Prashanth Neel Interview : ఔను, సలార్ ఆ మూవీకి రీమేక్ - ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న ప్రశాంత్ నీల్!

Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజా ఇంటర్వ్యూలో 'సలార్' ఉగ్రం రిమేక్ అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Salaar Director Prashanth Neel Latest Interview : కేజిఎఫ్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుండగా.. 'సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న యాక్షన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇదిలా ఉంటే సలార్ మూవీ గతంలో ప్రశాంత్ నీల్ తెలకెక్కించిన 'ఉగ్రం' సినిమాకి రీమేక్ అని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఇటీవల ‘సలార్’ నిర్మాత విజయ్ కిరగందుర్ అందులో వాస్తవం లేదని చెప్పారు.

కానీ తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం అది నిజమే అని ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ‘‘సలార్.. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ 'సలార్’ కథ ‘ఉగ్రం’ సినిమాని బేస్ చేసుకుని రాసింది’’ అని చెప్పుకొచ్చారు". ‘ఉగ్రం’ సినిమాను భారీ ఎత్తున ఆడియన్స్ నడుమ థియేటర్స్ లో చూడాలని అనుకున్నాను. కానీ 2014 టైంలో సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అనుకున్నంత హిట్ అవ్వలేదు. సినిమాని చాలా పెద్ద రేంజ్ లో ఊహించాను. ఉగ్రం కథకి చాలా పెద్ద స్కోప్ ఉంది. 'కేజిఎఫ్' రేంజ్ కథ అది. అందులో చెప్పలేకపోయిన పాయింట్స్ ను 'సలార్' రూపంలో తీశాను. అందుకే సలార్ సినిమా కథ ‘ఉగ్రం’ మూవీని పోలి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సలార్ మూవీని ఉగ్రం స్టోరీ బేస్ తో ‘కేజీఎఫ్’ స్టైల్ లో తీశాను" అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్.

అలా అని ఆ రెండు సినిమాలకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా కేజీఎఫ్ కథ 80ల కాలంలో సాగుతుందని, ‘సలార్’ కథ ప్రస్తుత కాలంలో ఉంటుందని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ సుమారు రూ.250కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృద్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, టీనూ ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.50 కోట్ల మార్క్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల ఓపెనింగ్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Also Read : నటి గౌతమి ఆస్తుల కేసులో నిందితులకు ఎదురుదెబ్బ - బెయిల్ నిరాకరించిన కోర్టు

టాప్ హెడ్ లైన్స్

Scene OTT : ఓటీటీలోకి సూర్య 'సీన్' - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సూర్య 'సీన్' - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Releases : నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
ENE Repeat Srinath Maganti : గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
IND VS NZ 1st Test Result: తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం
తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం, డ్రాగా ముగిసిన మ్యాచ్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
Mushrooms in Winter : చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?
చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?
AP Panchayat Elections Phase 1: ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Embed widget