ENE Repeat Srinath Maganti : గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
ENE Repeat Karthik : 'ENE Repeat'లో తన నటనతో యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రేక్షకుల మనసు దోచేశారు. కార్తీక్ పాత్రలో ఒదిగిపోయారు. రిలీజ్‌కు ముందు విమర్శలకు చెక్ పెట్టేశారు.

Srinath Maganti Impresses As Karthik In ENE Repeat Movie : 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటిని అనౌన్స్ చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. సుశాంత్ రెడ్డిని మ్యాచ్ చేస్తాడా? లేదా? అని అందరిలోనూ అనుమానాలుండేవి. 'ఈ నగరానికి ఏమైంది' ఫ్యాన్స్ అసలే కార్తిక్ పాత్రలో సుశాంత్‌కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు.
అలా అందరినీ సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టినా శ్రీనాథ్ మాగంటి ఇమేజ్‌కి కూడా డ్యామేజ్ అవుతుంది. సుశాంత్ తన వ్యక్తిగత కారణాలు, కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టడం, సినిమా నుంచి తప్పుకోవడంతో కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ మాగంటి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, తనదైన నటనతో కార్తీక్ పాత్రలో అదరగొట్టాడు శ్రీనాథ్ మాగంటి.
గ్యాంగ్‌లో ఒకడిగా...
తరుణ్ భాస్కర్ లాంటి ప్యాషనేట్ డైరెక్టర్‌తో కలిసి వర్క్ చేసేందుకు శ్రీనాథ్ కూడా అంతే ఇంట్రెస్ట్‌తో ఎదురు చూశాడు. ఫస్ట్ డే షూటింగ్ రోజు ఒక వేళ శ్రీనాథ్... కార్తీక్ పాత్రలో ఇమడకపోయినా, సంతృప్తి కలగకపోయినా ఇంకో ఆప్షన్‌కి వెళ్దామన్న కోణంలో మేకర్స్ ఉన్నారు. కానీ ఆ విషయం శ్రీనాథ్‌కి తెలియదు. అయితే, కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ ప్రాణం పోశాడు. సుశాంత్‌ని మ్యాచ్ చేస్తూ ఆ రోల్‌లో ఒదిగిపోయి... ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయాడు.
శ్రీనాథ్, శివాత్మిక ట్రాక్ కూడా పండింది. సినిమా విడుదలకు ముందున్న సందేహాల్ని శ్రీనాథ్ పటాపంచలు చేసేశాడు. ట్రోలింగ్ చేసిన వారంతా ఇప్పుడు కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ న్యాయం చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నా నటనతో సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరొక నటుడిని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారు. కానీ ఈ రోజు, సినిమా విడుదలైంది. నేను దానిలో భాగమయ్యాను. అదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు’ అని శ్రీనాథ్ ఎమోషనల్ అవుతున్నారు. 'హిట్', 'యానిమల్' వంటి చిత్రాలలో సైడ్ ఆర్టిస్ట్‌గా మంచి సక్సెస్ అందుకున్న శ్రీనాథ్‌కి ఇప్పుడు ఈ కార్తీక్ పాత్ర, సినిమా విజయంతో మరింత బాధ్యత పెరిగిపోయింది. ఇకపై శ్రీనాథ్ లీడ్ రోల్స్‌తో అందరినీ అలరించేందుకు సిద్దంగా ఉన్నాడు.
ట్రెండింగ్ వార్తలు























