Sai Pallavi: పెళ్లి పీటలెక్కబోతున్న సాయిపల్లవి, నిజమేనా?
సాయిపల్లవికి సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో 'ఫిదా' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మలయాళం ముద్దుగుమ్మ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ రాయ్' వంటి హిట్టు సినిమాల్లో నటించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడం లేదు. ఈ క్రమంలో ఆమె పెళ్లికి రెడీ అవుతుందనే రూమర్లు పుట్టుకొచ్చాయి.
ప్రస్తుతం సాయి పల్లవి నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రానా హీరోగా నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతున్నా రిలీజ్ కి మాత్రం నోచుకోవడం లేదు. 'విరాటపర్వం' విడుదల తరువాత సాయిపల్లవి పెళ్లి పీటలెక్కబోతుందట. అందుకే ఆమె ఇప్పటివరకు ఎలాంటి కొత్త సినిమాలను కూడా ప్రకటించడలేదని టాక్.
అయితే సాయిపల్లవి సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. స్క్రిప్ట్ విషయంలో పల్లవి పక్కాగా ఉండాలనుకుంటోందట. అందుకే మంచి కథ తన దగ్గరకు వచ్చే వరకు ఎదురుచూస్తోందని చెబుతున్నారు. 'భోళాశంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో ముందుగా సాయిపల్లవిని సంప్రదించారు.
కానీ ఆమె రిజెక్ట్ చేసింది. నటిగా తనకు మరింత మంచి పేరు తీసుకొచ్చే పాత్రలే చేయాలనుకుంటుందట. అందుకే కొత్త సినిమాలను ప్రకటించలేదని అంటున్నారు. మరి సాయిపల్లవి నిజంగానే మంచి పాత్ర కోసం ఎదురుచూస్తుందా..? లేక పెళ్లి కోసమే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదా అనేది తెలియాలంటే.. సాయిపల్లవి ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే!
Also Read: బ్రేకప్ తో బిజీగా ఉన్నావా? షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్లు
View this post on Instagram