అన్వేషించండి

RRR HCA Spotlight Award : 'ఆర్ఆర్ఆర్'కు ఎదురు లేదు, ఇంకో అవార్డు - ఎక్కడ వచ్చిందో అడగాలంతే

'ఆర్ఆర్ఆర్' సినిమాకు మరో అవార్డు వచ్చింది. పురస్కారాల వేటలో రాజమౌళి సినిమాకు ఎదురు లేకుండా పోతోంది.  వరుసపెట్టి అవార్డులు వస్తున్నాయి. 

'ఆర్ఆర్ఆర్' (RRR Movie) కు అవార్డు... ఈ మాట వినడం, చదవడం ప్రేక్షకులు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే... ఇది ఆరంభం మాత్రమే! దీనికి ఇప్పట్లో అడ్డు వచ్చే సినిమాలు ఏవీ లేకపోవచ్చు. ఒకటి, రెండు, మూడు, నాలుగు... ఇలా భారతీయ ప్రేక్షకులు 'ఆర్ఆర్ఆర్'కు వస్తున్న అవార్డులను లెక్క పెడుతూ పోవాలి. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు మరో అవార్డు వచ్చింది. సారీ... ఒకటి కాదు, రెండు వచ్చాయి. విదేశీ విమర్శకులు మన సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి...
అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' మరో అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (Hollywood Critics Association) నుంచి అవార్డు అందుకుంది. 'ఆర్ఆర్ఆర్' కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు స్పాట్ లైట్ విన్నర్ అవార్డు వచ్చింది. దీంతో మరోసారి దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
 
అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి...
RRR Movie Wins Best International Picture at Atlanta Film Critics Circle : ఆల్రెడీ 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్'గా అవార్డు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'కు, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ కూడా అదే విభాగంలో అవార్డు ఇచ్చింది. దీంతో ఆ అవార్డుల సంఖ్య మూడుకు చేరింది. 

ఇంతకు ముందు... సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో నాలుగు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. శాటన్ (50th Saturn Awards) పురస్కారాల్లో 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. 

Also Read : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సుజిత్‌ సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఓటు దర్శక ధీరుడికే!
'ఆర్ఆర్ఆర్' (RRR Movie) ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని భారతీయ ప్రేక్షకులు చాలా మంది ఆశ పడుతున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆస్కార్ కంటే ముందు విదేశాల్లో పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు 'ఆర్ఆర్ఆర్'ను పంపిస్తున్నారు. దేశభక్తి కథతో రాజమౌళి తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చూసి విదేశీయులు ఫిదా అవుతున్నారు. అవార్డులు ఇస్తున్నారు.

ప్రతి ఏడాదీ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఇస్తోంది. వివిధ వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఆన్ లైన్ మీడియా సంస్థలకు చెందిన క్రిటిక్స్ ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు... 1935 నుంచి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ చిత్రసీమలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డు ఇచ్చారు. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. 'ఆర్ఆర్ఆర్'కు గాను ఆయనకు అది తొలి ఇంటర్నేషనల్ అవార్డు. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు జపాన్‌లో ఆడుతోంది. ఈ సినిమా వసూళ్లు రికార్డులు మాత్రమే కాదు... భారతీయ, విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా పలువురు హాలీవుడ్ దర్శక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ 'ఆర్ఆర్ఆర్' అద్భుతమని ప్రశంసిస్తూ ట్వీట్లు వేశారు. ప్రశంసలకు తోడు ఇప్పుడు అవార్డులు కూడా వస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
Embed widget