(Source: ECI/ABP News/ABP Majha)
RRR: అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ - గర్వపడుతున్నా అన్న ప్రభాస్!
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్లోబ్ అవార్డులకు ఎంపిక అయింది.
హాలీవుడ్ అవార్డుల సీజన్‌లో RRR గ్లోబల్ డామినేషన్ కొనసాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ ఎపిక్ మూవీ జనవరిలో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో ఆర్ఆర్ఆర్ పోటీపడనుంది. దీన్ని ప్రభాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం విశేషం.
నిజ జీవిత విప్లవకారులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాక అంతర్జాతీయ ప్రేక్షకులలో అభిమానులను సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్ఆర్ఆర్‌లో సీతారామరాజుగా రామ్ చరణ్, భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. బ్రిటీష్ నటులు రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ నటించారు.
ఈ అవార్డుల్లో నామినేషన్ కోసం భారతదేశం నుంచి గంగూబాయ్ కతియావాడీ, కాంతారా, చెల్లో షో కూడా పోటీ పడ్డాయి. కానీ ఆర్ఆర్ఆర్‌కు మాత్రమే నామినేషన్లు దక్కాయి. ‘Chhello Show’ సినిమా ఇండియా నుంచి ఆస్కార్స్‌కు అఫీషియల్‌గా సబ్మిట్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ను వివిధ విభాగాలలో పరిశీలన కోసం ఇండిపెండెంట్‌గా సబ్మిట్‌గా చేశారు.
నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డు కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ), అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా), క్లోజ్ (బెల్జియం), డెసిషన్ టు లీవ్ (దక్షిణ కొరియా) సినిమాలు కూడా పోటీ పడనున్నాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం జనవరి 10వ తేదీన లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. (భారతదేశ కాలమానం ప్రకారం జనవరి 11 ఉదయం) హాస్యనటుడు జెరోడ్ కార్మిచెల్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు.
ఒక వేళ ‘ఆర్ఆర్ఆర్’ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలిస్తే ఈ అవార్డు సాధించిన గెల్చుకున్న రెండో ఇండియన్ సినిమా కానుంది. గతంలోనే ‘గాంధీ (1982)’ సినిమా ఈ అవార్డును మొదటిసారి గెలుచుకుంది. కానీ దానికి హాలీవుడ్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్బరో దర్శకత్వం వహించాడు. కాబట్టి ఈ అవార్డును ఆర్ఆర్ఆర్ సాధిస్తే గోల్డెన్ గ్లోబ్ సాధించిన తొలి ఇండియన్ డైరెక్టర్ కానున్నాడు.
View this post on Instagram