Rocky Aur Rani Kii Prem Kahaani Teaser: కరన్ జోహార్ ఈజ్ బ్యాక్ - రణవీర్, అలియాల ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ టీజర్ చూస్తే మీరూ అదే అంటారు!
‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహాని’ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ విడుదల అయిన మొదటి గంటలోనే దాదాపు రెండు లక్షల 50 వేల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది..
Rocky Aur Rani Kii Prem Kahaani Teaser: బాలీవుడ్ లో కరణ్ జోహార్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. కరణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహాని’ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ టీజర్ ను తాజాగా షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ విడుదలైన కొద్ది నిమిషాలలో భారీగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే..
టీజర్ విడుదలైన మొదటి గంటలోనే దాదాపు రెండు లక్షల 50 వేల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది. అంతే కాకుండా 2019 లో వచ్చిన ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత రణవీర్, ఆలియా కలసి ఈ మూవీలో కలిసి కనిపించనున్నారు. అలాగే దర్శకుడు కరణ్ జోహార్ కూడా దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఈ మూవీతో దర్శకుడిగా మారారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. ఇక టీజర్ విషయానికొస్తే.. కరణ్ జోహార్ సినిమాలంటే ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా మూవీస్ గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా అలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీలానే అనిపిస్తుంది. ఈ మూవీలో కూడా రణవీర్, అలియా లవ్ ట్రాక్ అలాగే ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కరణ్ మార్క్ కలర్ఫుల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. మూవీలో స్టార్ కాస్ట్ కూడా పెద్దదే ఉంది. 1 నిమిషం 19 సెకన్ల ఈ టీజర్ లో ఫ్యామిలీ, డ్యాన్స్, డ్రామా, రొమాన్స్, ట్విస్ట్‌లతో నిండిపోయిందనే చెప్పాలి. ఈ టీజర్ చూస్తుంటే కరణ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'కభీ ఖుషీ కభీ ఘమ్' గుర్తొస్తుంది. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
ఇప్పుడే ఆట మొదలైంది: అలియా
అలియా భట్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ఆమె తాజాగా నటించిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహాని’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసింది అలియా. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘‘ప్రస్తుతానికి మిమ్మల్ని టీజర్ తో ఖుషీ చేస్తున్నాము అసలు కథ ఇప్పుడే మొదలైంది’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే రణవీర్ సింగ్ కూడా ఈ టీజర్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ జూలై 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.