Tiger Nageswara Rao first look: 5 భాషల్లో, ఐదుగురు సూపర్ స్టార్స్ - ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్లాన్ మాములూగా లేదుగా!
రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈనెల 24న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఐదుగురు సూపర్ స్టార్స్, 5 భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించనున్నారు.
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే ఈ మూవీ విడుదలకు సంబంధించి డేట్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మే 24న ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్న ఐదుగురు పాన్ ఇండియన్ స్టార్స్
ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ స్ట్ లుక్ పోస్టర్ ను ఏకంగా ఐదుగురు పాన్ ఇండియన్ స్టార్స్ రిలీజ్ చేయనున్నారు. వీరిలో సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్ హీరోస్ ఉన్నారు. హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో శివరాజ్ కుమార్ , మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో రజినీకాంత్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. తెలుగులో ఎవరు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇందుకోసం చిత్రబృందం భారీగా ఏర్పాటు చేస్తోంది. తాజాగా చిత్ర బృందం కన్నడ స్టార్ హీరో శివన్నను కలిసి సినిమా గురించి వివరించారు. ఆయన ఈ సినిమాను పూర్తి మద్దతు ప్రకటించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ శివన్న మెచ్చుకున్నారు.
5 ఎకరాల్లో స్టువర్టుపురం సెట్
‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. 1970-80 ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఐదు ఎకరాల స్థలంలో స్టువర్టుపురం సెట్ వేశారు మేకర్స్. ఇందులో రవితేజ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
5 SUPERSTARS from 5 LANGUAGES are coming together to introduce #TigerNageswaraRao to the world ❤️🔥
— Tiger Nageswara Rao (@TNRTheFilm) May 16, 2023
First Look on May 24th 💥💥#TNRFirstLookOnMay24@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 pic.twitter.com/sp76rSmb0u
Karunada Chakravarthy @NimmaShivanna Garu will introduce #TigerNageswaraRao to the world in Kannada with his majestic voice ❤🔥
— Tiger Nageswara Rao (@TNRTheFilm) May 17, 2023
First look on May 24th 💥💥#TNRFirstLookOnMay24@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh pic.twitter.com/WnY35Ob2Ax
‘ధమాకా’ నుంచి దుమ్మురేపుతున్న రవితేజ
‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ సినిమా కెరీర్ మళ్లీ గాడిలో పడింది. వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ‘ధమాకా’ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ ఏడాది కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నారు ఈ మాస్ హీరో. సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవికు తమ్ముడిగా పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. రవితేజ నటించిన ‘రావణాసుర’ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తాజాగా దసరా పండుగ టార్గెట్ గా ‘టైగర్ నాగేశ్వరరావు’ ను రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇందులో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!