Ravi Teja Tweet: మమ్మల్ని సైలెంట్‌గా సైడ్ చేసారా? వైవా హర్షాకు రవితేజ స్వీట్ పంచ్ - ఫ్యాన్స్ అయోమయం
వైవా హర్ష చేసిన ట్వీట్ ను హీరో రవితేజ్ రీ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. వైవా హర్ష ప్రాజెక్టు ఏంటి? దాని నుంచి రవితేజను తొలగించడం ఏంటి? అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు ఆయన ‘ఈగల్’ అనే మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదలకానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ టీజర్ కూడా సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ట్విట్టర్ లో వైవా హర్ష ట్వీట్
తాజాగా వైవా హర్ష ట్వీట్ కు రవితేజ రీట్వీట్ చేయడం నెటిజన్లు అలరించింది. ఓయూట్యూబ్ వీడియోతో తన ప్రస్తానానికి ప్రారంభించి సెలబ్రిటీగా ఎదిగిన వ్యక్తి వైవా హర్ష. అతడి ఆధ్వర్యంలో వస్తున్న సినిమా ‘#SM’. ఈ యంగ్ కామెడియన్ ట్విట్టర్ లో తన రాబోయే చిత్రానికి సంబంధించిన ఫన్ ప్రీ లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో వెల్లడించాడు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 79 ఏళ్ల వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకుని పరీక్ష రాస్తాడు. అన్ని స్పెల్లింగులు తప్పుల తడకగా రాస్తాడు. కానీ, పేపర్ దిద్దిన టీచర్ మాత్రం అన్నిటికీ రైట్ వేస్తారు. అంతేకాదు, పదికి పది మార్కులు వేస్తాడు. టీచర్ టీఎస్ సుందర్ రావు సోషల్ స్టడీస్ అని రాస్తారు. ఆ తర్వాత సోషల్ స్టడీస్ కొట్టివేసి ఇంగ్లీష్ అని రాస్తారు. ఆ పోస్టర్ కిందన ఫస్ట్ లుక్ సూన్ అని రాశారు. అది కూడా తప్పులు తప్పులుగా ఉండటం విశేషం.
వైవా హర్ష ట్వీట్ కు రవితేజ రీ ట్వీట్
వైవా హర్ష ట్విట్టర్ పోస్టుకు మాస్ మహారాజ్ రవితేజ స్పందించారు. తమరు మాకు చెప్పిన కథ ఇదేనా మాస్టారు అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. “తమరు అప్పుడు చెప్పిన కథ ఇదేనా మాస్టారూ, మమ్మల్ని సైలెంట్ గా సైడ్ చేసారా ప్రాజెక్ట్ నుండి?” అంటూ రీ ట్వీట్ చేశారు. గతంలో ఈ సినిమా కథ తనకు చెప్పారని, ఇప్పుడు ఆ కథతోనే మరొకరితో సినిమా చేస్తున్నారని రవితేజ ట్వీట్ ఉద్దేశం. అటు, ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా మరిన్ని వివరాలను వెల్లడిస్తానని హర్ష సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Thamaru appudu cheppina katha idhena Mastaruuu …
— Ravi Teja (@RaviTeja_offl) June 12, 2023
Mammalni silent ga side chesara project nunchi? https://t.co/vqPepOqdJe
రవితేజ నటిస్తోన్న మరో సినిమా ‘టైగర్ నాగేశ్వరావు’. ఈ చిత్రం అక్టోబర్ 20న దసరా కానుకగా విడుదల కానుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా నటిస్తోంది. రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: విషాదంలో సాయి ధరమ్ తేజ్ - ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్, స్పందించిన మనోజ్