అన్వేషించండి

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

Rashmika : అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో లో రష్మిక మందన తన అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడింది.

Rashmika Video Call To Her Fan : బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబచ్చన్ పోస్టుగా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో సందడి చేసింది రష్మిక మందన. ఈ సందర్భంగా ఆమె అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడింది. అంతేకాకుండా ఇదే షోలో అమితాబచ్చన్ సైతం యానిమల్ లో రష్మిక పర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డీటెయిల్స్ లోకి వెళితే.. కౌన్ బనేగా కరోడ్ పతి తాజా ఎపిసోడ్ లో మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ బాస్కె అనే కంటెస్టెంట్ బిగ్ బి తో గేమ్ ఆడేందుకు వచ్చారు. గేమ్ లో భాగంగా ప్రమోద్, 'సార్ మీరు నా హాబీస్ గురించి అడగలేదు?' అంటూ అమితాబ్ తో చెప్పాడు.

దాంతో 'నీ హాబీస్ ఏంటి?' అంటూ బిగ్ బీ అడిగారు."నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తాను. ముఖ్యంగా సౌత్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను రష్మిక మందన కి చాలా పెద్ద అభిమానిని. నాలాంటి అభిమాని ఆమెకు మరొకరు ఉండరు. ఆమె ఫస్ట్ మూవీ 'కిరిక్ పార్టీ' 2016లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఆమెకు అభిమానిగా మారాను. ఈ సందర్భంగా మీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో నేను రష్మిక నుంచి మూడుసార్లు రిప్లై అందుకున్నాను. ట్విట్టర్లో ఆమెకు ప్రపోజ్ కూడా చేశాను" అని ఆ కంటెస్టెంట్ అమితాబ్ తో చెప్పుకొచ్చాడు. దానికి అమితాబ్ 'మరి ఈ మధ్య ఏమైనా రష్మికతో మాట్లాడావా?' అని అడిగితే...

Also Read: పాపం... ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

'లేదు సార్ ఆమె ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది. నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పింది' అని అన్నాడు. అనంతరం 'నీ ఫేవరెట్ హీరోయిన్ గురించి చెప్పావు కదా! మరి ఆమెను ఎప్పుడైనా మీట్ అయ్యావా? అని అమితాబ్ అడిగితే.." లేదు సార్ నేను ఎప్పుడూ ఆమెను మీట్ అవ్వలేదు. కనీసం ఒక్కసారైనా మీట్ అవ్వాలని అనుకుంటున్నాను" అని ఆ కంటెస్టెంట్ అన్నాడు. దాంతో అమితాబ్ షోలోనే రష్మికకి వీడియో కాల్ కనెక్ట్ చేసి.." నీ డై హార్ట్ ఫ్యాన్ ప్రమోద్ నా ముందు కూర్చున్నాడు. అతనితో మాట్లాడు" అని చెప్పాడు.

దాంతో సదరు కంటెస్టెంట్ వీడియో కాల్ లో రష్మికని చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాడు." మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. మీతో ఇలా మాట్లాడటం నా డ్రీమ్" అని అన్నాడు. అందుకు రష్మిక బదులిస్తూ... "కచ్చితంగా నిన్ను ఒకరోజు డైరెక్ట్ గా కలుస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్. నిన్ను చూసి గర్వపడుతున్నాను" అని చెప్పింది. ఆ తర్వాత రష్మికకు థాంక్స్ చెబుతూ అమితాబ్ బచ్చన్... "నీ లేటెస్ట్ ఫిలిం యానిమల్ అమేజింగ్. సినిమాలో నీ పర్ఫామెన్స్ చాలా బాగుంది. ఫెంటాస్టిక్. దీని గురించి కచ్చితంగా మనం ఓ రోజు కూర్చొని మాట్లాడదాం" అంటూ చెప్పారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.

Also Read : మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్‌ ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Embed widget