అన్వేషించండి

Rashmika: రష్మిక అదృష్టం కలిసి రాలేదే - 'గుడ్ బై' సినిమాకి డల్ ఓపెనింగ్స్!

రీసెంట్ గా 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. అయితే ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. 

కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక(Rashmika).. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

రీసెంట్ గా 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొదటి రోజు ఈ సినిమా ఇండియా మొత్తం కలుపుకొని రూ.90 లక్షలు మాత్రమే రాబట్టింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై హైప్ వచ్చింది. రష్మిక కూడా ఈ సినిమా కోసం నార్త్ మొత్తం తిరిగి ప్రమోషన్స్ చేసింది. బాలీవుడ్ మీడియా కూడా రష్మికను బాగా ప్రమోట్ చేసింది. కానీ ఏదీ కలిసి రాలేదు. కోటి రూపాయలు ఓపెనింగ్స్ కూడా రాబట్టని ఈ సినిమా ఎక్కువ రోజులు థియేటర్ లో నిలబడేలా కనిపించడం లేదు. 

డెబ్యూ ఫిల్మ్ తో బాలీవుడ్ లో సత్తా చాటాలనుకున్న రష్మిక ఆశ నెరవేరనట్లే. ప్రస్తుతం ఆమె ఖాతాలో 'యానిమల్', 'మిషన్ మజ్ను' వంటి బాలీవుడ్ సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తెలుగులో ఈ బ్యూటీ 'పుష్ప2', 'వారసుడు' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 

క్రేజీ సీక్వెల్ లో రష్మిక:
1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 'ఆషికీ3' రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు దీపికా పదుకోన్, అలియా భట్ ల పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. మరి వీరిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.

ఆగిపోయిన రష్మిక సినిమా:
ఇటీవల 'స్క్రూడీలా' అనే మరో సినిమా ఓకే చేసింది రష్మిక. టైగర్ ష్రాఫ్ హీరోగా దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ అంతా చూసుకున్న ఆయన వర్కవుట్ కాదని భావిస్తున్నారు. ఈ సినిమాను రూ.140 కోట్ల రెమ్యునరేషన్ తో చిత్రీకరించాలనుకున్నారు. రీసెంట్ గానే 'లైగర్' సినిమాతో నిర్మాత కరణ్ జోహార్ కి భారీ నష్టాలొచ్చాయి. అందుకే ఇకపై బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ప్లాప్ అయినా.. తక్కువ నష్టంతో బయటపడే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమా అతడికి రిస్క్ అనిపించడంతో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.

Also Read : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...

Also Read : ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget