News
News
X

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్తలు వాస్తవమే అనిపిస్తోంది. తాజాగా ఈ జంట మాల్దీవులకు వెళ్తూ ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కింది.

FOLLOW US: 

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలు కామన్. నచ్చితే కలిసి ఉంటారు. లేదంటే విడిపోతారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం ప్రేమలో మునిగి తేలుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని గతంలో ఓసారి వివరణ ఇచ్చినా.. ప్రేమకు సంబంధించిన రూమర్స్‌ను మాత్రం రష్మిక, విజయ్ ఏనాడూ ఖండించలేదు. అలాగని, ఎస్ అని కూడా చెప్పలేదు. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ చాలా సార్లు మీడియాకు కనిపించారు కూడా.

గడిచిన కొద్ది రోజులుగా వీరి ప్రేమ మరింత బలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. తాజాగా ఈ జంట ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. రష్మిక వైట్ డ్రెస్ లో, విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ లో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ కలిసి వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్తున్నట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది. పెళ్ళికి ముందే  ఈ జంట రొమాంటిక్ టూర్ కు వెళ్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు మాల్దీవులకు వెళ్తున్నారనే వార్తలు.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి తెలుగులో రెండు సినిమాలు చేశారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్, రష్మిక మధ్య లిప్ లాక్ సీన్ అప్పట్లో సంచలనం అయ్యింది. ఈ సీన్ పై నెటిజన్లు రష్మికను ఓ రేంజిలో ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కారణంగా కొంత కాలం తాను ఎంతో ఇబ్బంది పడ్డానని రష్మిక తాజాగా వెల్లడించింది. ఎన్నో రాత్రులు ఏడుస్తూ నిద్రపోయానని చెప్పింది.   

News Reels

మరోవైపు రష్మిక మందన్న నటించి బాలీవుడ్ చిత్రం ‘గుడ్ బై’ శుక్రవారం విడుదల అయ్యింది. బిగ్ బీతో కలిసి నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో గత కొద్ది రోజులుగా రష్మిక యాక్టివ్ గా పాల్గొంది. ఓ వైపు సినిమా విడుదల అవుతుంటే, మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా రష్మిక నటించిన ‘పుష్ప’ చిత్రంతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. ‘పుష్ప-2’లోనూ ఈమే హీరోయిన్ గా చేస్తున్నది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నది. అటు విజయ్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ డిజాస్టర్ గా మిగిలింది. తన తర్వాతి ప్రాజెక్టులపై ఆయన ఫోకస్ పెట్టాడు. 

Also Read: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?
Also Read: అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

Published at : 07 Oct 2022 01:44 PM (IST) Tags: Rashmika Mandanna Vijay Devarakonda maldives trip Vijay Devarakonda Latest Photos Rashmika Mandanna latest photos

సంబంధిత కథనాలు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'