అన్వేషించండి

Ramayanam Movie: సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్, సీత పాత్రలో అలియాభట్, రావణుడిగా యష్ - త్వరలోనే ‘రామాయణం’ షూటింగ్

దర్శకుడు నితీష్ తివారీ డైరెక్షన్లో మరో రామాయణం సినిమా రాబోతుందనే వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తుండగా రావణుడిగా యష్ చేయనున్నాడట.

Ramayanam Movie: బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతోంది. ఇప్పటికే దర్శకుడు ఓమ్ రౌత్ రామాయణ ఇతిహాసాల ఆధారంగా ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరో రామాయణ సినిమా రాబోతుందనే వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ త్వరలో రామాయణ కథతో సినిమా తీస్తున్నారనే వార్తలు కొన్ని నెలలుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజం అవుతున్నట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపైనే బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనడుస్తోంది. 

సీతారాములుగా రణబీర్ కపూర్, అలియా భట్ - సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్

‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. ఇప్పుడీ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీత గా అలియా భట్ నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ పాత్రల గురించి గతం నుంచీ వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. తొలుత సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సాయి పల్లవి స్థానంలో అలియా భట్‌ను తీసుకున్నారని, రియల్ లైఫ్ జంటను సీతారాములుగా చూసేందుకు ప్రేక్షకులకు ఇష్టపడతారని.. అందుకే ఈ మార్పు చేశారని తెలిసింది.

ఇటీవల అలియా భట్.. దర్శకుడు నితీష్ తివారీతో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అలాగే రామాయణానికి సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రణబీర్ కపూర్ కూడా రాముడి పాత్ర లుక్ టెస్ట్ లు చేసినట్టు తెలుస్తోంది. అందుకే రణబీర్, అలియా ‘రామాయణం ఆఫీస్’కు కూడా తరచుగా వెళ్తున్నారట. ఇక్కడే నితీస్ తివారీ, నమిత్ మల్హోత్రా, మధు మంతెన బృందం ఈ మూవీ గురించి చర్చలు చేస్తున్నారట. దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే దీపావళికి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రావణుడిగా యష్..

‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ స్టార్ హీరో యష్ క్రేజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. గతంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు నితీష్ తివారీ అలాగే మధు మంతెన కలసి రావణుడి పాత్ర కోసం కొన్ని నెలలుగా యష్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి యష్ ఇంకా అఫీషియల్ గా ఓకే చేయనప్పటికీ కశ్చితంగా చేస్తాడని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఈ మధ్యలో యష్ వేరే పెద్ద ప్రాజెక్టులకు ఓకే చేయడంతో ఈ మూవీ చేయడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మరోవైపు ఈ సినిమా గురించి యష్ ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాడట. అందుకే యష్ ఈ ప్రాజెక్టులో భాగం అవుతారని చూస్తున్నారట. దీనిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత రానుందని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ మూవీను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ, రవి ఉద్యవార్‌తో కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ సినిమా గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి. 

Also Read శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Romantic Thriller OTT: ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget