అన్వేషించండి

Hanuman - Ram Movie: హనుమాన్ రూటులో రామ్ - ఆ సినిమాలా హిట్ అవుతుందా?

'హనుమాన్' టీమ్ ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇచ్చారు. ఆ సినిమా రూటులో 'రామ్' టీమ్ కూడా వెళుతోంది. టికెట్ మీద ఐదు రూపాయలు విరాళం ఇవ్వడానికి రెడీ అయ్యింది. వాళ్ళు ఎవరికీ ఇస్తారంటే?

'హనుమాన్' సినిమా టీమ్ విడుదలకు ముందు ఓ ప్రకటన చేసింది. ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలను అయోధ్యలో రామయ్య మందిరానికి విరాళంగా ఇస్తామని తెలియజేసింది. సేమ్ రూటులో 'రామ్' సినిమా టీమ్ వెళుతోంది. తమ సినిమాకు వచ్చే కలెక్షన్లలో ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తెలిపింది. మరి, వాళ్లు ఎవరికి ఇస్తున్నారో తెలుసా? 

నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు 'రామ్' విరాళం 
రామ్... అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్! దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దీంతో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా పరిచయం అవుతున్నారు. దేశంలో తీవ్రవాదం, హిందూ - ముస్లిం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దేశంలో అలజడి, కల్లోలం సృష్టించడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలు... వాళ్ళను ఎదుర్కొన్న హీరో సినిమా కథాంశం. అందుకని, నేషనల్ డిఫెన్స్ ఫండ్ (National Defence Fund)కు టికెట్ మీద ఐదు రూపాయలు విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు దేశమంతా 'హనుమాన్' ఆడుతోందని, 'రామ్' కూడా ఆ సినిమా తరహాలో విజయం సాధిస్తుందని ఇందులో కీలక పాత్ర చేసిన సాయి కుమార్ చెప్పారు.  

'రామ్' సినిమాను దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓఎస్‌ఎం విజన్‌ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందించింది. హీరోతో పాటు దర్శకుడు మిహిరామ్ వైనతేయకు కూడా తొలి చిత్రమిది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయన రాశారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. 

సూర్య అయ్యల సోమయాజుల సరసన ధన్యా బాలకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ... ''మా మొదటి చిత్రమిది. మేం సినిమా నేపథ్యం నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన నిర్మాణ వ్యయంలో సినిమా తీశారు. హీరో సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ ఎమోషనల్ సీన్ కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాకు తెగే ప్రతి టికెట్‌ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌కు ఇస్తాం. మన సైనికులకు ఈ సినిమాను అంకితం ఇస్తున్నాం'' అని చెప్పారు.

Also Read: సీఎం యోగిని కలిసిన 'హనుమాన్' - ఏయే టాపిక్స్ డిస్కస్ చేశారంటే?
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ... ''మంచి కంటెంట్‌ ఉన్న చిత్రమిది. ఎన్నో ఆర్థిక కష్టాలు పడి చిత్రాన్ని నిర్మించారు. నేను రషెస్ చూశా. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమాలో సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

Also Readరామ్ చరణ్ బర్త్‌ డేకి ముందు - నయా మేకోవర్‌తో సెట్స్ మీదకు!

Hanuman - Ram Movie: హనుమాన్ రూటులో రామ్ - ఆ సినిమాలా హిట్ అవుతుందా?

హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ... ''మాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. నేను, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్... సినిమాకు మెయిన్ పిల్లర్స్. ఫ్రెండ్స్ అంతా కలిసి ఫండింగ్ చేసి సినిమా తీశాం. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. వందలో 60 మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది. భానుచందర్, సాయి కుమార్ గారు చెప్పే డైలాగ్స్థాం తూటాల్లా పేలతాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ ఇస్తుంది'' అని అన్నారు. ధన్యా బాలకృష్ణ, మిహిరామ్ వైనతేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Readఎన్టీఆర్ 'దేవర' డేట్ మీద కన్నేసిన దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'

టాప్ హెడ్ లైన్స్

Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget