Pic Talk: వైట్ అండ్ వైట్ లో చరణ్, ఉపాసన - ఫొటో వైరల్
తాజాగా రామ్ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో చరణ్, ఉపాసన ఇద్దరూ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని కనిపించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. జూన్ 14తో వీరిద్దరూ పెళ్లి చేసుకొని పదేళ్లు పూర్తి కావొస్తుంది. వారి పెళ్లి యానీవర్సరీను సెలబ్రేట్ చేసుకోవడానికి కాస్త ముందుగానే ట్రిప్ కి వెళ్లింది ఈ జంట. ప్రస్తుతం ఇద్దరూ ఇటలీలో ఉన్నారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా రామ్ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో చరణ్, ఉపాసన ఇద్దరూ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని కనిపించారు. చుట్టూ గ్రీనరీ, మధ్యలో చరణ్-ఉపాసన ఒకరినొకరు చూసుకుంటూ ఫొటోకి పోజిచ్చారు. దీనికి స్మైలీ ఎమోజీని జోడిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు రామ్ చరణ్. ఈ ఫొటో చూసిన మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
రామ్ చరణ్-ఉపాసనకు అడ్వాన్స్ గా మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. ఈ జంటకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటోంది ఈ జంట. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన #RC15 సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు శంకర్(Shankar) రూపొందిస్తోన్న ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ(Kiara Advani) కనిపించనుంది.
Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!
Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















