Ram Charan In Leo Movie: విజయ్ ‘లియో’ మూవీలో ట్విస్ట్ - లోకేష్ యూనివర్స్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ?
లోకేష్ యూనివర్స్ ప్రస్తుతం సౌత్ సైడ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలుసిందే. ఇప్పుడా యూనివర్స్ లోకి మన తెలుగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా భారతీయ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘ఆర్ సి 15’ సినిమాలో నటిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో ఆయన నేషనల్ లెవల్ లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందుకే శంకర్ తో సినిమా ప్రకటించినప్పటి నుంచీ ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గురించి మైండ్ బ్లాక్ అయిపోయే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారట. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..
తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి విజయ్ నటిస్తోన్న సినిమా ‘లియో’. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో ఓ కొత్త యూనివర్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ లో ఇప్పుడు విజయ్ ‘లియో’ కూడా వచ్చిచేరింది. ఈ మూవీ కూడా ఈ యూనివర్స్ లో భాగంగానే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్, లోకేష్ కాంబోలో ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఇక ‘విక్రమ్’ సినిమాతో లోకేష్ రేంజ్ నేషనల్ లెవల్ లో పెరిగింది. ఈ నేపథ్యంలో ‘లియో’ సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు అని వార్తలు రావడంలో మరింత ఉత్కంఠ మొదలైంది. దీంతో ఈ మూవీ పై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది ప్రస్తుతానికైతే ఎవరికీ తెలియదు. అయితే దీనికీ ఓ రీజన్ ను ఎలివేట్ చేస్తున్నారు నెటిజన్స్. ‘లియో’ సినిమా ప్రోమోలో కనిపించిన కారు నెంబరు తెలంగాణ రాష్ట్రానికి చెందినదిగా కనిపిస్తోంది. కాబట్టి ఇందులోనే చరణ్ ఎంట్రీ ఇస్తాడు అంటూ లాజిక్ లు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఈ చర్చలతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
Also Read: 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
వాస్తవానికి రామ్ చరణ్ లోకేష్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’ సినిమాల తర్వాత వీరి సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య రామ్ చరణ్ కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ లలో కనిపించారు. ఇప్పుడు లోకేష్ సినిమాలో కూడా ఓ చిన్న క్యామియో చేశారని అంటున్నారు. క్లైమాక్స్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్లు లియో దగ్గరకు వచ్చే క్రమంలో వాళ్ళలో ఒకడుగా చరణ్ ఉంటారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి నిజంగా రామ్ చరణ్ ను గెస్ట్ రోల్ లో కనిపిస్తారా లేదా తర్వాత ఫుల్ లెన్త్ రోల్ లో సినిమా చేస్తారా అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా రామ్ చరణ్ లోకేష్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నారనే వార్తలతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.