By: ABP Desam | Updated at : 13 Feb 2023 01:00 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@SVC_official/twitter
బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. జైపూర్ వేదికగా ఇటీవలే వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు వందకు పైగా వీవీఐపీలను హాజరైనట్లు తెలిసింది. కియారా తన పెళ్లికి రాంచరణ్, ఉపాసనను కూడా ఆహ్వానించారు. కానీ, అనివార్య కారణాల వల్ల వారు వివాహానికి హాజరుకాలేపోయారు. ఈ సందర్భంగా ఉపాసన కియారా అద్వానీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. పెళ్లికి హాజరుకాలేనందుకు క్షమాపణలు చెప్పింది. రామ్ చరణ్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‘RC15’లో నటిస్తున్నది. ఈ చిత్రంలో కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. అయితే, కియారా పెళ్లి కారణంగా ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు ‘RC15’ టీమ్ కియారా-సిద్ధార్థ్ దంపతులకు అదిరిపోయే రీతిలో వెడ్డింగ్ విషెస్ చెప్పింది. హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు సహా చిత్ర బృందం అంతా కొత్త జంటకు మర్చిపోలేని రీతిలో శుభాకాంక్షలు అందించారు. అందరూ నూతన జంటకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను సినిమా యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life!
Wishing you a lifetime of happiness, love and light❤
Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI — Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023
పెళ్లి తర్వాత హీరోయిన్ లకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ, కియారా గతంలో మాదిరిగానే సినిమాలు చేసేందుకు సిద్ధార్థ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సన్నిహితుల సమాచారం. కియారా తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ మూవీలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారడంతో టాలీవుడ్‌లో మరే సినిమాలకు సైన్ చేయలేదు. తాజాగా ‘RC15’లో హీరోయిన్ గా చేస్తోంది.
Team #RC15 #SVC50 wraps up a song shoot in New Zealand.
— Sri Venkateswara Creations (@SVC_official) November 30, 2022
Mega powerstar @AlwaysRamCharan shares pictures from the sets and appreciates the efforts of the entire team...@shankarshanmugh @SVC_official @DOP_Tirru @MusicThaman @advani_kiara pic.twitter.com/9Rui7qsD41
Read Also: ‘సీతారామం’ బ్యూటీపై దారణ ట్రోలింగ్, నేనూ మనిషినే అంటూ ఆవేదన!
అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు
ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన
Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా