అన్వేషించండి

Rakul Preet Singh: 4 రోజుల షూట్ తర్వాత ప్రభాస్ మూవీ నుంచి లాగి పడేశారు- రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్‌

Rakul Preet Singh: కెరీర్ కొత్తలో ఎదురైన కొన్ని ఘటనలు చాలా బాధపెట్టాయని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుని, షూటింగ్ తర్వాత తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది.

Rakul Preet Singh Replaced From Prabhas Movie: సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్ల విషయం పరిస్థితి ఇంకాస్త దారుణంగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పలు కారణాలతో తప్పుకోవడం లేదంటే తప్పించించే సందర్భాలు ఉంటాయి. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించి అగ్రతారగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఇలాంటి పలు సంఘటనలు ఎదురయ్యాయి.

ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తొలగించారు- రకుల్

కెరీర్ కొత్తలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా వచ్చిందని, కొద్ది రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండా తీసేశారని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. “టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొత్తలో నాకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత నా షెడ్యూల్ కంప్లీట్ కావడంతో మరో సినిమా షూటింగ్ కోసం వెళ్లాను. ఏం జరిగిందో తెలియదు, నన్ను ఈ సినిమా నుంచి తీసేశారని తెలిసింది. కనీసం నన్ను తొలగిస్తున్నట్లు మాట వరుసకైనా చెప్పలేదు. ఆ తర్వాత మరో సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పటి నుంచి సినిమాలు ఒప్పుకునే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను” అని రకుల్ చెప్పుకొచ్చింది.

ధోని బయోపిక్ లో నటించనందుకు బాధపడ్డా- రకుల్

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ‘MS ధోని’ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చినా, పలు కారణాలతో తప్పుకున్నట్లు రకుల్ వెల్లడించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించలేకపోయినందకు చాలా బాధపడ్డానని చెప్పింది. “నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కే ‘MS ధోని’సినిమాలో హీరోయిన్ గా సైన్ చేశాను. కాస్ట్యూమ్స్, స్క్రిప్ట్ రీడింగ్ పూర్తి చేశాను. కానీ ఆ తర్వాత డేట్స్ మారాయి. అప్పటికే నేను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలకు ఒప్పుకున్నాను. ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ మరో నెలలో విడుదలకావాల్సి ఉంది. ఇంకా రెండు పాటలను చిత్రీకరించలేదు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. చివరికి నా స్థానంలో దిశా పటానీ నటించింది. ఇంత మంచి సినిమాలో నటించలేకపోయినందుకు చాలా ఏడ్చాను” అని వెల్లడించింది. 

నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా- రకుల్

నెపోటిజం అనేది ప్రతి సినిమా పరిశ్రమలో ఉందని.. ఈ కారణంగా  చాలా అకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది రకుల్. “ప్రతి సినిమా పరిశ్రమలో నెపోటిజం ఉంది. నెపోటిజనం కారణంగా నేను చాలా సినిమా అవకాశాలను కోల్పోయాను. ఒక్కోసారి బాధ కలిగేది. అలాగని ఏడుస్తూ కూర్చునేదాన్నికాదు. ఆ సినిమాలు మనం చేసే రాత లేదనుకునేది. మానాన్న ఆర్మీలో పని చేశారు. ఆయన నుంచి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలో నేర్చుకున్నాను. అందని వాటి గురించి పెద్దగా ఆలోచించను. స్టార్ కిడ్ కు అవకాశాలు వచ్చినట్లుగా కొత్తవారికి రావు అనేది అనేది మాత్రం నిజం” అని వెల్లడించింది. రకుల్ తెలుగులో చివరగా 2021లో విడుదలైన ‘కొండపొలం’ అనే సినిమాలో కనిపించింది. రీసెంట్ గా ‘భారతీయుడు 2’లో నటించింది. ప్రస్తుతం అజయ్‌ దేవగన్ 'దే దే ప్యార్‌ దే 2'లో నటిస్తున్నది.

Read Also: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక పరిణామం, నటి హేమకు షాకిచ్చిన పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Lavanya Bharadhwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ.. లావణ్య భరద్వాజ్ లవ్ మ్యారేజీ, రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ.. లావణ్య భరద్వాజ్ లవ్ మ్యారేజీ, రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Agadha Release Date : గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Lenin: అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget