Rajinikanth on Kantara : హ్యాట్సాఫ్ రిషబ్ శెట్టి, ట్వీటే కాదు ఫోన్ కూడా - 'కాంతార' ఫ్యాన్స్ జాబితాలో సూపర్ స్టార్
'కాంతార'ను మెచ్చుకుంటున్న సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అయినటువంటి రిషబ్ శెట్టిని ప్రశంసించారు.
ఇండియన్ బాక్సాఫీస్ బరిలో 'కాంతార' దూకుడు కొనసాగుతోంది. వసూళ్ల వేటలో ఈ సినిమా 'తగ్గేదే లే' అన్నట్లు ముందుకు వెళుతోంది. కేవలం వసూళ్లు మాత్రమే సాధించడం కాదు... సినీ ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. ఈ సినిమాను మెచ్చుకున్న, చిత్ర బృందాన్ని అభినందించిన చిత్రసీమ ప్రముఖుల జాబితాలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు.
Rajinikanth Appreciates Kantara : ''కాంతార' సినిమా చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రచయిత, దర్శకుడు, నటుడు... రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాలో మాస్టర్ పీస్ లాంటి సినిమా అందించిన చిత్ర బృందం అందరికీ కంగ్రాట్స్. తెలిసిన దానికంటే ఏమీ తెలియకపోవడం ఎక్కువ అని హోంబలే ఫిలిమ్స్ కంటే బాగా ఎవరూ చెప్పలేరు'' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
రజనీకాంత్ ట్వీట్ చేయడంతో సరిపెట్టలేదని... రిషబ్ శెట్టికి ఆయన ఫోన్ చేశారని చెన్నై వర్గాలు తెలిపాయి. ఆయన అభినందనతో 'కాంతార' బృందం ఫుల్ ఖుషీలో మునిగింది.
“The unknown is more than the known” no one could have said this better in cinema than @hombalefilms #KantaraMovie you gave me goosebumps @shetty_rishab Rishab hats off to you as a writer,director and actor.Congrats to the whole cast and crew of this masterpiece in indian cinema
— Rajinikanth (@rajinikanth) October 26, 2022
నా కల నిజమైంది : రిషబ్ శెట్టి!
''డియర్ రజనీకాంత్ సార్... ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మీరు. నా చిన్నప్పటి నుంచి మీకు పెద్ద అభిమానిని. మీ నుంచి ప్రశంస రావడంతో నా కల నిజమైంది. ప్రాంతీయ కథలు చెప్పడానికి నా స్ఫూర్తి మీరు. నన్నే కాదు... ఎంతో మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. థాంక్యూ'' అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. హోంబలే ఫిలిమ్స్ కూడా రజనీకి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.
Dear @rajinikanth sir 😍 you are biggest Superstar in India and I have been your fan since childhood. Your appreciation is my Dream come true. You inspire me to do more local stories and inspire our audiences everywhere. Thank you sir 🙏❤️ https://t.co/C7bBRpkguJ
— Rishab Shetty (@shetty_rishab) October 26, 2022
The Thalaiva has spoken. @Rajinikanth Sir Our team feel blessed n encouraged by your kind words. This has made our day n indeed our year too. At @hombalefilms we’re proud of our rich culture n it is our endeavour to bring our proud culture to the world
— Hombale Films (@hombalefilms) October 26, 2022
Wooooooooo #Kantara 🔥 https://t.co/xkGpLQxFjb
తెలుగులో 'కాంతార' విడుదలకు ముందు సంగతి... రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చూశారు. అంతే కాదు... తాను రెండు సార్లు చూశానని, తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిదని ఆయన పేర్కొన్నారు. అప్పటికి కన్నడలో సినిమా విడుదల అయ్యింది. సెప్టెంబర్ 30న విడుదలైన 'కాంతార' సునామి, ఆ తర్వాత అక్టోబర్ 15న మిగతా భాషలకు చేరింది. ప్రతి భాషలోనూ మంచి విజయం సాధించింది. విడుదలైన 25 రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది.
Also Read : ఇషాలో 'కాంతార' - ఆ ఘనత అందుకున్న రెండో సినిమారా
'కాంతార' నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) ఈ చిత్రానికి నిర్మాత. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది. తెలుగులో కూడా మంచి వసూళ్లు వచ్చాయి.
రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు 'కాంతార' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు జంటగా సప్తమి గౌడ నటించారు. కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్, తెలుగులో పంపిణీ : అల్లు అరవింద్ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకత్వం : రిషబ్ శెట్టి.