By: ABP Desam | Updated at : 26 Oct 2022 01:49 PM (IST)
'కాంతార'లో రిషబ్ శెట్టి
ఆధ్యాత్మిక కేంద్రమైన ఇషా ఫౌండేషన్‌లో 'కాంతార' సినిమా (Kantara Movie) ను ప్రదర్శించారు. అయితే? అందులో స్పెషల్ ఏముంది? అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ! సద్గురు అలియాస్ జగ్గీ వాసుదేవ్ బాబాకు చెందిన ఇషాలో సినిమా ప్రదర్శన అనేది చాలా అంటే చాలా అరుదు. అసలు వివరాల్లోకి వెళితే...
ఇంతకు ముందు ఇషా ఫౌండేషన్‌లో ప్రదర్శించిన ఏకైక సినిమా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మణికర్ణిక'. ఇప్పుడు ఆ ఘనతను 'కాంతార' సినిమా అందుకుంది. దీపావళి సందర్భంగా షో వేశారు. ఈ విషయాన్ని ఇషా ఫౌండేషన్ ట్వీట్ చేసింది.
కాంతార @ 200 కోట్లు!
'కాంతార' సినిమాకు లభిస్తున్న గౌరవం పక్కన పెడితే... వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా మంచి జోరు మీద ఉంది. బాక్సాఫీస్ దగ్గర రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ విజయయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. కన్నడలో సెప్టెంబర్ 30న సినిమా విడుదల అయ్యింది. పదిహేను రోజుల తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ పాతిక రోజుల్లో అన్ని భాషల్లో వసూళ్లు చూస్తే... రెండు వందల కోట్ల రూపాయలు దాటింది.
Also Read : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' @ టెంపుల్ సెట్!
భాషలకు, ప్రాంతాలకు అతీతంగా 'కాంతార'ను ప్రజలు ఆదరిస్తున్నారు. సినిమాలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, భూత కోలతో పాటు సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో తమ బాణీని కాపీ చేశారంటూ లీగల్ నోటీస్ రావడం చిత్ర బృందానికి షాక్ అని చెప్పాలి. తాము స్వరపరిచిన 'నవసర...'కు 'వరాహ రూపం' కాపీ అని 'తైక్కుడం బ్రిడ్జ్' సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది.
'కాంతార' నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది. ఆయన సినిమాను అవుట్ రేటుకు కొనకుండా కమిషన్ బేసిస్ మీద విడుదల చేసినట్టు సమాచారం. అందువల్ల, ఆయనకు వచ్చే లాభాలు తక్కువే.
తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రేక్షకులు సైతం 'కాంతార'పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. లేటెస్టుగా సినిమాను పూజా హెగ్డే చూశారు. చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రిషబ్ శెట్టి, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్, తెలుగులో పంపిణీ : అల్లు అరవింద్ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకత్వం : రిషబ్ శెట్టి.
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>