అన్వేషించండి

Pushpa2: 'పుష్ప2' అప్డేట్ - అల్లు అర్జున్ పై కొత్త లుక్ టెస్ట్!

'పుష్ప2' సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది..? ప్రస్తుతం ఏం జరుగుతోందనే విషయంపై ఓ లీక్ దొరికింది.   

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది..? ప్రస్తుతం ఏం జరుగుతోందనే విషయంపై ఓ లీక్ దొరికింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పై లుక్ టెస్ట్ జరుగుతోందట. ఆమీర్ పేట్ దగ్గరలో ఉన్న ఒక సినిమా స్టూడియోలో ఈ లుక్ టెస్ట్ జరుగుతోందని సమాచారం. దర్శకుడు సుకుమార్ ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. 'పుష్ప2'లో అల్లు అర్జున్ మొదటి పార్ట్ కంటే ఇంకా వైవిధ్యంగా కనపడనున్నారని తెలుస్తోంది. 

పార్ట్ 1 చివరికి అల్లు అర్జున్ డాన్ గా మారతారు. అందుకే రెండో పార్ట్ లో సినిమా మొదటి నుంచే అల్లు అర్జున్ డాన్ అవతారంలో కనిపించనున్నారు. ఈ డాన్ అవతారంలో అల్లు అర్జున్ ఎలా కనిపిస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందో అనే విషయం పై పలు ఫొటోస్ తీసి టెస్ట్ చేస్తున్నారు. ఈరోజు, రేపు లుక్ టెస్ట్ జరగనుంది. అన్ని పోజుల్లో అల్లు అర్జున్ ఫొటోస్ తీసి ఒక లుక్ ని ఫైనల్ చేయనున్నారు. ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. 

అల్లు స్టూడియోస్ లో తొలి సినిమా షూటింగ్ గా 'పుష్ప2' మొదలుకాబోతుంది. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరి ఈసారి మారేడుమిల్లి వెళ్తారో లేక ఇతర అడవి లొకేషన్స్ ఏమైనా చూస్తారో తెలియాల్సివుంది. విదేశాల్లో కూడా అటవీ లొకేషన్స్ చూస్తున్నారని టాక్. ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారో చూడాలి!

బన్నీకి విలన్ గా పవర్‌ఫుల్‌ పొలిటీషియన్:
మొదటి పార్ట్ లో బన్నీకి సపోర్ట్ గా ఉండే ఎంపీ రోల్ లో రావు రమేష్ కనిపించారు. ఎర్ర‌చంద‌నం సిండికేట్ మొత్తాన్ని పుష్ప చేతిలో పెట్టి వెనుక ఉంటూ కథ నడిపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ రోల్ ఉంటుందట. ఫహద్ ఫాజిల్ తో కలిసి సదరు పొలిటీషియన్ బన్నీతో ఫైట్ కి దిగుతాడట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆదిపినిశెట్టి లాంటి స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

2023లో 'పుష్ప' రిలీజ్:

2023లో 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.

Also Read : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...

Also Read : ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

టాప్ హెడ్ లైన్స్

Mayookha Telugu Trailer: ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
Dorothy Controversy: ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: రెండు కత్తులు దక్కించుకునేదెవరు? కొట్టుకుంటున్న రెండు టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: రెండు కత్తులు దక్కించుకునేదెవరు? కొట్టుకుంటున్న రెండు టీమ్స్!
Anakapalli Movie: మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget