Pushpa The Rule : కథ వినకుండా 'పుష్ప' ఓకే చేసిన బన్నీ - సెకండ్ పార్ట్ మీద హైప్ చేస్తున్న టీమ్
కథ వినకుండా 'పుష్ప' సినిమాను అల్లు అర్జున్ ఓకే చేశారని దర్శకుడు సుకుమార్ చెప్పారు. అంతే కాదు... సెకండ్ పార్ట్ మీద టీమ్ అంతా కలిసి విపరీతంగా హైప్ పెంచుతున్నారు.
పుష్ప... పుష్పరాజ్... సౌత్, నార్త్ తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు, అన్ని వయసుల ప్రజలు ఆదరించిన క్యారెక్టర్, పాన్ ఇండియా సినిమా. 'తగ్గేదే లే' అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, ఆ మేనరిజమ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ నుంచి ఫుట్ బాల్ వరకు... రియాలిటీ షోస్ నుంచి కామన్ పబ్లిక్ వరకు... అన్నింటా 'పుష్ప' కనిపించాడు.
'పుష్ప' ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు 'పుష్ప 2' మీద చాలా అంచనాలు ఉన్నాయి. అది చాలదని అన్నట్టు టీమ్ ఇంకా హైప్ పెంచేస్తోంది. సారీ... 'పుష్ప 2' గురించి యూనిట్ చెప్పే మాటలు హైప్ మరింత పెంచేస్తున్నాయి.
కథ వినకుండా అల్లు అర్జున్ ఓకే చేశాడు!
నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. దీనికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కథ అందించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సమర్పణలో ఆయన ఆప్త మిత్రుడు బన్నీ వాసు నిర్మించారు. సోమవారం రాత్రి జరిగిన '18 పేజెస్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బన్నీ & సుకుమార్ వచ్చారు.
కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' ఓకే చేశాడని సుకుమార్ చెప్పారు. అంతే కాదు... ''ఐదు రోజులు 'పుష్ప 2' షూట్ చేశాం. అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటిస్తున్నాడంటే... చిన్న చిన్న డీటెయిల్స్ పట్టుకుని ఒక్కో ఎక్స్‌ప్రెషన్ కోసం అతను ఎంతో కష్టపడుతున్నాడు. నేను ఎప్పుడూ, ఏ సినిమా గురించి చెప్పను గానీ'' అంటూ 'పుష్ప 2'కు ఆకాశమే హద్దు అన్నట్టు పైకి వేలు చూపించారు. 'పుష్ప 2'లో అస్సలు తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పారు.
Also Read : షూటింగ్‌కు హీరోయిన్ డుమ్మా - సీరియస్ అయిన బాలకృష్ణ
ఆల్మోస్ట్ ఏడాది... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన 'పుష్ప' విడుదలై! గత ఏడాది డిసెంబర్ 17న పుష్పరాజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆయన. ఏడాది తర్వాత మళ్ళీ పుష్ప సెట్స్‌లో అడుగు పెట్టారు. ఈ మధ్య ఐదు రోజులు షూటింగ్ చేశారు.
సమ్మర్ 2024లో రిలీజ్!?
'పుష్ప' సినిమాకు ఇండియాలో, విదేశాల్లో వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకుని, 'పుష్ప 2' విషయంలో రాజీ పడకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్స్... అన్నిటికీ ఎలా లేదన్నా ఏడాదిన్నర సమయం కావాలని టీమ్ భావిస్తోంది. అందుకని, 2024 వేసవి టార్గెట్ చేస్తూ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదట 2023 క్రిస్మస్ అనుకున్నా... నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ దృష్టిలో పెట్టుకుని 2024 వేసవికి వెళుతున్నారట.
రష్యాలో 'పుష్ప 2' కూడా!
రష్యాలో కూడా 'పుష్ప 2' విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 'పుష్ప' విడుదలకు ముందు అక్కడి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే... 'పుష్ప' సినిమా విషయంలో చేసిన పొరపాటు 'పుష్ప 2'కి చేయకూడదని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు.
సేమ్ డే రిలీజ్ చేయాలని...
'పుష్ప 2'ను ఇండియాలో ఏ రోజు అయితే విడుదల చేస్తారో... అదే రోజున రష్యాలో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయినట్టు చిత్ర నిర్మాతలలో ఒకరైన వై. రవి శంకర్ పేర్కొన్నారు. ఒక్క రష్యా మాత్రమే కాదు... 'పుష్ప 2'ను ఇతర విదేశీ భాషల్లో కూడా అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రష్యా ఫైనలైజ్ చేశామని, ఇతర దేశాలలో విడుదల విషయమై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఫుడ్ బిజినెస్‌కు నయనతార సినిమా దెబ్బ కొడితే ఎలా?