అన్వేషించండి

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

'దసరా'తో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.ఆయన వివాహాం కరీంనగర్ లో జరగనుందని, ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం

Srikanth Odela : నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' ఇటీవలే విడుదలై ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా.. తాజాగా ఈ డైరెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీకాంత్ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

శ్రీకాంత్ ఓదెల వివాహం కరీంనగర్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా ఆయన వివాహం జరగనున్నట్టు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం తనకు పరిచయమున్న వారినే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ వివాహ వేడుకకు శ్రీకాంత్ గురువు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ నటిస్సోన్న 'పుష్ప 2' షూటింగ్ ను మే 30న మారేడుమిల్లిలో ముగించుకుని.. అక్కడ్నుంచి సుకుమార్ నేరుగా కరీంనగర్ కు ప్రయాణమైనట్టు తెలుస్తోంది. ఇక 'దసరా' సినిమాలో నాని సరసన నటించి, మెప్పించిన కీర్తి సురేష్ కూడా శ్రీకాంత్ వివాహానికి హాజరవనున్నట్టు సమాచారం.

ఎవరెవరు హాజరు కానున్నారంటే..

సినీ పరిశ్రమలో ఉన్నస్నేహితులకు కూడా పెళ్లి ఆహ్వానం పంపిన శ్రీకాంత్.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' తో మంచి హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా హాజరు అవుతున్నట్టుగా తెలుస్తోంది. 'దసరా' సినిమా నిర్మాత, ఆ సినిమాకి పని చేసిన కొంతమంది యూనిట్ సభ్యులు కూడా శ్రీకాంత్ పెళ్లికి రానున్నట్టు సమాచారం. 

అమ్మాయి ఎవరంటే..

ఇక శ్రీకాంత్ వివాహం చేసుకునే అమ్మాయికి సంబంధిన విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో ఆమె ఎవరు, ఏం చేస్తుంది అన్న విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అంతకుముందు శ్రీకాంత్ ఓదెల.. సినీ పరిశ్రమలో ఒక సినిమా దర్శకత్వం చేసిన తరువాతే వివాహం చేసుకుంటానని నిర్ణయించుకున్నాడని చెప్పినట్టు టాక్. అలా 'దసరా' సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు.. ఆ మూవీ విడుదలై మంచి హిట్ కూడా అవడంతో అతను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు..

ఇటీవల విడుదలైన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. విమర్శకులు సైతం ప్రశంసించిన ఈ సినిమాకు టాలీవుడ్ లోని పలువురు స్టార్ సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. దసరా మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీ టీమ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సినిమాలో నాని మేకోవర్ ను ఆయన మెచ్చుకున్నారు. ఇంతటి బ్రిలియంట్ మూవీ తీసిన శ్రీకాంత్ ఓదెల ఒక డెబ్యూ డైరెక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోయినట్లు ప్రస్తావించారు. ఈ ట్వీట్ కు రిప్లైగా శ్రీకాంత్. ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా’ పాటకు తను వీణ స్టెప్ వేసిన ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫొటోకు ‘ఎగురుతున్నా.. థాంక్యూ బాస్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. ఎప్పుడూ ఇంట్రావర్ట్‌గా ఉండే శ్రీకాంత్ ఇలా డాన్స్ చేస్తుండటం చూసి నెటిజన్లు కూడా షాక్ కు గురయ్యారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read Also : అది గతం, ఆలోచిస్తూ కూర్చోకూడదు - ‘రానా నాయుడు’ విమర్శలపై స్పందించిన వెంకటేష్

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget