అన్వేషించండి

Prabhas Birthday - Fans Disappointed : వైజయంతిని తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ - నాగ్ అశ్విన్‌ను కూడా!

ప్రభాస్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. స్మాల్ అప్‌డేట్ అంటే కనీసం హ్యాండ్ అయినా చూపిస్తారని అనుకున్నామని, కానీ ఇలా హ్యాండ్ ఇస్తారని అనుకోలేదని మండి పడుతున్నారు. 

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 'ప్రాజెక్ట్ కె' (Project K) దర్శకుడు నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ మీద మండి పడుతున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు నాడు తమను తీవ్ర నిరాశకు గురి  చేశారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొందరు అయితే బూతులు కూడా తిడుతున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
 
ప్రభాస్ పుట్టినరోజు (Prabhas Birthday)  సందర్భంగా ఈ రోజు 'ప్రాజెక్ట్ కె' నుంచి స్మాల్ అప్‌డేట్ ఇస్తామని నిన్న నాగ్ అశ్విన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దాంతో అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చేశారు. ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందోనని కొందరు రాత్రి నిద్రపోలేదు కూడా! అయితే, వాళ్ళకు వైజయంతి మూవీస్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ షాక్ ఇచ్చింది. 

Prabhas Birthday Wishes : ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ 'ప్రాజెక్ట్ కె' సెట్స్‌లో ఫైర్ క్రాకర్స్ కాల్చి ఆ వీడియో విడుదల చేసింది వైజయంతి మూవీస్. అది చూసిన అభిమానులకు కోపం వచ్చింది. 'ఇదేంటి?' అంటూ ట్విట్టర్‌లో రిప్లైలు, ఇన్‌స్టాగ్రామ్‌లో & ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌తో తాము ఎంతగా డిజప్పాయింట్ అయ్యిందీ చెప్పడం స్టార్ట్ చేశారు. 

View this post on Instagram
 
A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

'ఇదేనా అప్‌డేట్?' అంటూ కొందరు షాక్ అయితే... మరికొందరు 'ఇది అప్‌డేట్ అయ్యి ఉండదులే. జస్ట్ విష్ చేశారు. అప్‌డేట్ వస్తుంది' అని కామెంట్స్ చేశారు. చాలా మంది బూతులు తిట్టారు. గతంలో యువి క్రియేషన్స్ కూడా 'సాహో', 'రాధే శ్యామ్' సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఇటువంటి ఆగ్రహాన్ని చవి చూసింది. అప్‌డేట్ చెప్పిన సమయానికి ఇవ్వకపోయినా... ఇచ్చిన అప్‌డేట్ తమకు నచ్చకపోయినా... సోషల్ మీడియాలో తిట్టేవారు. ఇప్పుడు వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్ వంతు వచ్చింది. 

అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హ్యాండ్ లుక్ విడుదల చేశారు. కనీసం అటువంటి లుక్ అయినా వస్తుందని కొందరు వెయిట్ చేశారు. అదీ కాకుండా కేవలం బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు చెప్పడంతో అభిమానులు మండి పడుతున్నారు.  

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) జంటగా సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie)లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 18, 2023న... ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయడం కుదరకపోతే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు అశ్వినీదత్ వెల్లడించారు.

Also Read : ప్రభాస్ 'నో' చెప్పడం నేర్చుకోవాలా? మొహమాటాలు వదిలేయకపోతే ఫ్లాప్స్ తప్పవా?

హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget