Cinema Halls GST: జీఎస్టీ కట్ - సినిమా హాల్లో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలు తగ్గుతాయట, కానీ చిన్న ట్విస్ట్!
మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది జీఎస్‌టీ కౌన్సిల్. థియేటర్లలో ఇకపై చౌక ధరకే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమా థియేటర్లలో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ లాంటి ఫుడ్ ఐటెమ్స్ అధిక ధరకు అమ్మడంపై గత కొంత కాలంగా మూవీ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సినిమా టాకీసులలో నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్న సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా హాళ్లలో వినియోగించే ఫుడ్ ఐటెమ్స్, కూల్ డ్రింక్స్ మీద విధించే జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్ ఈ మేరకు తీర్మానం చేసింది. కానీ, ట్విస్ట్ ఏమిటంటే.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని, దానితో పాటు ఫుడ్‌ను బుక్ చేసుకుంటే 5 శాతం పన్ను రేటు వర్తించదు.
GST కౌన్సిల్ నిర్ణయంపై మూవీ లవర్స్ సంతోషం
సినిమా హాళ్లలో విక్రయించే ఫుడ్, డింక్స్ మీద పన్ను రేట్లను తగ్గించాలనే GST కౌన్సిల్ నిర్ణయంపై మూవీ లవర్స్ తో పాటు, మల్టీప్లెక్స్ ఆపరేటర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం థియేటర్ వ్యాపారం మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆపరేటర్లు వెల్లడించారు. ఇకపై కుటుంబ సభ్యులతో కలిసి తక్కువ వ్యయంతో సినిమాలను ఆస్వాదించే అవకాశం ఉంటుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి F&B (ఆహారం & పానీయాలు) సినిమా ఎగ్జిబిషన్ పరిశ్రమకు, ప్రత్యేకంగా మల్టీప్లెక్స్‌లకు 35 శాతం వరకు ఆదాయాన్ని అందిస్తుంది. అయితే, ఎక్కువ ధర ఉన్న కారణంగా చాలా మంది తినుబండారాలతో పాటు కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. మరికొంత మంది సినిమా థియేటర్లకు వచ్చేందుకే ఇష్టపడటం లేదు. అయితే, తాజా నిర్ణయంతో సినీ అభిమానులకు ఊరట కలిగింది. “సినిమా థియేటర్లలో విక్రయించే ఫుడ్స్, డ్రింక్స్ ను 'రెస్టారెంట్ సర్వీస్' కిందికి తీసుకురావడం సంతోషకరం. GST కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని మొత్తం సినీ పరిశ్రమ స్వాగతిస్తోంది. కరోనా మహమ్మారి అనంతరం థియేటర్ వ్యాపారం కొంత తగ్గింది. తాజా నిర్ణయంతో బిజినెస్ మరింత ఊపందుకునే అవకాశం ఉంటుంది” అని PVR INOX, CFO, నితిన్ సూద్ వెల్లడించారు.
థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరిగే అవకాశం
నిజానికి కరోనా తర్వాత ఫిల్మ్ ఎగ్జిబిషన్ పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు సినిమా వ్యాపారంలో, ప్రీమియం ఫుడ్ ఆఫర్ల కారణంగా ఎఫ్ అండ్ బి వెరైటీ విపరీతంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కంటే ముందు భారతదేశంలో 9,000 సినిమా స్క్రీన్‌లు ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని మహమ్మారి తర్వాత చాలా కాలం పాటు పరిశ్రమ పనిచేయకపోవడంతో ఆర్థిక సంక్షోభం కారణంగా మూసివేయబడ్డాయి. GST కౌన్సిల్ తాజా నిర్ణయంతో థియేటర్ బిజినెస్ కొంత మేర ఊపందుకునే అవకాశం ఉంది.
Read Also: బాబోయ్, 'ప్రేమ్ కుమార్ కథ'ను గుర్తు పెట్టుకోవడం కష్టమే - ట్విస్టులే ట్విస్టులు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial