News
News
వీడియోలు ఆటలు
X

Pooja Hegde: ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ ఫ్లాప్‌లపై స్పందించిన పూజా హెగ్డే

తెలుగులో ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్ సినిమాల్లో నటించిన పూజా హెగ్దే... ఆ సినిమాలు మాత్రమే ప్లాఫ్ అయ్యాయని, తాను కాదన్నారు. వాటిల్లో తన పర్ఫామెన్స్‌కు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు కూడా దక్కాయని చెప్పారు.

FOLLOW US: 
Share:

Pooja Hegde: ఏడాది వ్యవధిలో అత్యధిక ఫ్లాప్‌లు సొంతం చేసుకున్న హీరోయిన్ల జాబితా తీస్తే.. పూజా హెగ్డే పేరే ముందుంటుంది. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా ఫ్లాప్‌లు వస్తుంటే.. కెరీర్ అక్కడితో ఆగిపోతుంది. కానీ, పూజా హెగ్డేకు మాత్రం అలా కాదు. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో దర్శక నిర్మాతలు ఆమెకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. ఆమె సల్మాన్‌తో నటించిన ‘కిసికా భాయ్, కిసి కా జాన్’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా ఆమె తన ఫ్లాప్ సినిమాలపై కూడా స్పందించింది.

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోనన బుట్టబొమ్మ పూజా హెగ్దే. పూజా కెరీర్ ప్రారంభంలో ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ బన్నీ లాంటి స్టార్ హీరోలతో నటించి, భారీ హిట్స్ కొట్టింది. దీంతో ఆమెను టాలీవుడ్ లక్కీ ఛార్మ్, గోల్డెన్ లెగ్, గోల్డెన్ హ్యాండ్  అని పొగిడారు. కానీ ఆ తర్వాత సీన్ మొత్తం రివర్సైంది. 2022లో రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’, బాలీవుడ్‌లో ‘సర్కస్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేశాయి. 

మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో.. లాంటి సినిమాలతో బిజీగా మారిపోయిన పూజాకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్టు అయిపోయింది. కోలీవుడ్‌లోనూ ఆమెకు ‘బీస్ట్’ రూపంలో మరో దెబ్బ పడింది. ఈ సినిమాలు ప్లాఫ్ అయినా.. పూజాపై ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. ‘రాధే శ్యామ్‌’లో కొంచెం పర్వాలేదనిపించినా.. ‘ఆచార్య’కు మరింత దారుణమైన ఫలితం వచ్చింది. దీంతో పూజా మళ్లీ తెలుగు తెరపై కనిపించడం కష్టమనే టాక్ నడిచింది. కానీ, SSMB28లో ఛాన్స్ కొట్టేసింది.

సినిమాలే ఫ్లాప్.. నేను కాదు: పూజా హెగ్డే

తాజా ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి కానీ తాను కాలేదని స్పష్టం చేశారు. తన పర్ఫామెన్స్‌కు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు దక్కాయని, ఈ సినిమాల్లో ప్రేక్షకులు తనను ఇష్టపడ్డారని కూడా పూజా చెప్పుకొచ్చింది. ఈ సినిమాల వల్ల తనకు నష్టమేమీ జరగలేదని, ప్రతీది అనుభవమే అని పేర్కొంది.

ప్రతి సినిమాకు ఒక సొంత డెస్టినీ ఉంటుందని, అలా ప్లాఫ్ అయిన సినిమాకూ ఓ ఓన్ డెస్టినీ ఉందని పూజా అన్నారు. దాని వల్ల తనకు ఎంత లాభం జరిగిందన్న విషయాన్ని పట్టించుకోనని చెప్పారు. తనకు ఒకప్పుడు వరుసగా ఆరు బ్లాక్‌బస్టర్‌లు వచ్చాయని, ఇప్పుడు 1,2  హిట్ కాకపోవడం పెద్ద విషయమేం కాదని తెలిపారు. ప్రస్తుతం తన దగ్గర ఈ సినిమా (కిసీ కా భాయ్ కిసీ కి జాన్)  ఉందని, త్వరలో మరో సినిమా కూడా రాబోతోందంటూ పూజా చెప్పారు. వివిధ భాషల్లోనూ మరో 2, 3 అవకాశాలు రానున్నాయన్నారు.

Also Read ఆ పబ్‌లో తెలుగు పాటలే వినబడతాయ్ - వర్మ మెచ్చిన బీర్ టెయిల్

Published at : 18 Apr 2023 02:19 PM (IST) Tags: Acharya Radhe Shyam Cirkus Kisi Ka Bhai Kisi Ki Jaan Pooja Hegde Salman Khan

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !