News
News
X

Ponniyin Selvan 2: ‘పొన్నియన్ సెల్వన్-2’ వచ్చేస్తోంది - ఇదిగో రిలీజ్ డేట్!

‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా దీనికి సంబంధించి ఓ కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

FOLLOW US: 
Share:

ప్రముఖ భారతీయ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ దేశ వ్యాప్తంగా ఎంత భారీ హిట్ ను అందుకుందో పెద్దగా చెప్పక్కర్లేదు. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీను తెరకెక్కించారు మణిరత్నం. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే మొదటి భాగం సెప్టెంబర్ 30, 2022 న విడుదలై భారీ కలెక్షన్స్ సాధించింది. కార్తీ, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ఈ హిస్టారికల్ మూవీలో నటించి మెప్పించారు. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ మూవీ సెకండ్ పార్ట్ కు సంబంధించి ఓ కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

‘పొన్నియిన్ సెల్వన్ 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ చారిత్రాత్మక చిత్రం దర్శకుడి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిందే. ఎప్పటినుంచో ఈ కథను తెరకెక్కించాలని చూస్తున్నారట ఆయన. మధ్యలో ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరింది. ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 500 కోట్ల రూపాయలతో ఒకేసారి చిత్రీకరించారు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది.  

View this post on Instagram
 
A post shared by Lyca Productions (@lyca_productions)

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి భాగం భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 450 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అంతే కాదు కేవలం ఒక్క తమిళ్ లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. తమిళనాడులో 200 కోట్లు సాధించిన మొదటి సినిమాగా నమోదైంది. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం ఎక్కువ శాతం తమిళ నేటివిటీతోనే తెరకెక్కించడంతో అక్కడ మాత్రం భారీ వసూళ్లు సాధించింది. మిగతా చోట్ల అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా చోట్ల మిక్సిడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. అలాగే ఈ సినిమాపై కొన్ని చోట్ల మిశ్రమ స్పందన రావడంతో చాలా మంది థియేటర్లకు వెళ్లి చూడలేదు.

Also Read : అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు - టాప్‌లో బాలకృష్ణ, నెక్స్ట్ ఎవరంటే?

‘పొన్నియిన్ సెల్వన్’ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. నవంబర్ 4 నుంచి ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి స్పందన వచ్చింది. చాలా రోజులు ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచిందీ మూవీ. కాగా, మొదటి పార్ట్ లో చిన్న చిన్న లోపాలు ఉండటం వలన సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా ఓవరాల్ గా వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది. అందుకే ఈసారి సెకండ్ పార్ట్ లో అలాంటి లోపాలు కనబడకుండా చాలా పగడ్బందీగా సినిమాను తీర్చిదిద్దుతున్నారట మణిరత్నం. మరి సెకండ్ పార్ట్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  

Published at : 28 Dec 2022 07:39 PM (IST) Tags: Maniratnam Ponniyin Selvan Ponniyin Selvan 2 PS 2

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

BRS Nanded Meeting :  నాందేడ్‌లో  బీఆర్ఎస్  బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్,  అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!