Sai Pallavi: పొలం పనుల్లో స్టార్ హీరోయిన్, గుర్తుపట్టారా?
ఉగాది రోజున సెలబ్రిటీలంతా కుటుంబసభ్యులతో కలిసి వైభవంగా పండగ జరుపుకుంటే.. సాయిపల్లవి మాత్రం కూలీలతో కలిసి పండగ జరుపుకుంది.

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఎంత సింపుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై కూడా నేచురల్ గా కనిపించడానికి ఇష్టపడుతుంది. మేకప్ పెద్దగా వేసుకోదు. తెరవెనుక కూడా సింపుల్ గా జీవిస్తుంటుంది. స్టార్ హీరోయిన్ అనే రేంజ్ ఎప్పుడూ చూపించదు. దానికి తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోనే నిదర్శనం. ఉగాది రోజున సెలబ్రిటీలంతా కుటుంబసభ్యులతో కలిసి వైభవంగా పండగ జరుపుకుంటే.. సాయిపల్లవి మాత్రం కూలీలతో కలిసి పండగ జరుపుకుంది.
అంతేకాదు.. వారిలానే వ్యవసాయ కూలీగా మారి పనులు కూడా చేసింది. ఆడవాళ్లంతా పొలం పనుల్లో ఉండగా.. అదే తరహాలో సాయిపల్లవి కూడా రెడీ అయి.. వారితో కలిసి పంటకోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ ఫొటో చూసిన అభిమానులు సాయిపల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, శ్రద్ధాశ్రీనాథ్ కూడా ఈ ఫొటోలపై స్పందించారు. 'నీలా మరెవరూ లేరంటూ..' శ్రద్ధాశ్రీనాథ్ కామెంట్స్ చేయగా.. అనుపమ హార్ట్ సింబల్ ను కామెంట్ గా పెట్టింది. అభిమానులైతే ఆమె సింప్లిసిటీను కొనియాడుతున్నారు. ఇక సాయిపల్లవి సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. త్వరలోనే 'విరాటపర్వం' సినిమాతో అలరించనుంది.
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















