అన్వేషించండి

Pavitra Lokesh: నా భర్త నన్ను ఎంతో గౌరవిస్తారు, నేను చాలా లక్కీ: పవిత్ర లోకేష్

‘‘ఓ సీరియల్‌లో నటిస్తున్నప్పుడు మా మనసులు కలిశాయి. ఆయనలోని మంచితనాన్ని మరెవ్వరిలో చూడలేం. ఆయనకు భర్తగా లభించడం చాలా లక్కీ’’ - పవిత్ర లోకేష్

సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి ఇటీవల పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవిత్రాను నటుడు వీకే నరేష్ నాలుగో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, వార్తల్లో నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమేనని నరేష్ వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు. దీనిపై పవిత్రా లోకేష్ మాత్రం స్పందించలేదు. నరేష్, పవిత్ర కొన్నేళ్లు సహజీవనం చేస్తున్నట్టు టాలీవుడ్ వదంతులు వచ్చాయి. వారిద్దరు ఒకే ఇంట్లో నివసిస్తున్నారని, నరేష్ కుటుంబంతో అనేక వేడుకల్లో పవిత్రా కనిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల నరేష్, పవిత్ర మహబలేశ్వరం వెళ్లారు. అక్కడ చాలా మంది వీరిద్దరినీ జంటగా చూశారు. పెళ్లికి ముందు ఆశీస్సులు తీసుకోవడానికే అక్కడికి వెళ్లారంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వారు ఆ ఆలయం చరిత్రపై సినిమా తీస్తున్నారని, అందుకే అక్కడికి వెళ్లారని సన్నిహితులు తెలిపారు. అయితే, ఐదేళ్ల కిందట పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు, ఆమె మాటల్లోనే..  

ప్రేమ అలా పుట్టింది..: ‘‘మేమిద్దరం కలిసి ఒక సీరియల్‌లో నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన(సుచేంద్ర ప్రసాద్) చాలా గొప్ప వ్యక్తి. నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా బెటర్ పర్శన్. అలాంటి వ్యక్తిని మరొకరిలో చూడలేం. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేం. ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు’’ అని పవిత్ర తెలిపారు.

వంట కూడా ఆయనే చేసేస్తారు: ‘‘ఆయన రచయిత, దర్శకుడు, నటుడు కూడా. కానీ, నాకు ఆయన నటుడిగానే నచ్చుతారు. ఇద్దరు కలిసి జంటగా నటించే అవకాశం వచ్చింది. కానీ, ఇద్దరం ఒకేసారి షూటింగ్‌కు వెళ్తే పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరని.. ఆ అవకాశాలను వదులుకొనేవాళ్లం. అలాంటి భర్త దొరికినందుకు నేను చాలా లక్కీ. కొంచెం టైమ్ ఉన్నా సరే సుచేంద్ర నాకు వండి పెట్టేస్తారు. ఇంట్లో అన్ని పనులు ఆయన చేస్తారు’’ అని పేర్కొన్నారు. 

నా సినిమాలు చూడరు: ‘‘ఆయన నేను తనకే సొంతమని భావించేవారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. నేను కూడా ఏ రోజు ఒత్తిడి చేయలేదు. నా సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం ఏమిటని కూడా అడగలేదు. ఆయన కూడా తనకు ఏ సినిమా నచ్చిందనే విషయాన్ని చెప్పరు. ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాలు గురించి మేం మాట్లాడుకోం’’ అని పవిత్ర ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, పవిత్ర లోకేష్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారా? కుటుంబంతో కలిసి ఉంటున్నారా అనేది తెలియదు. ప్రస్తుతం వస్తున్న పుకార్లపై పవిత్ర తాజాగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.  

Also Read: పవిత్ర లోకేష్, 16 ఏళ్ల వయస్సులోనే గుండె పగిలే విషాదం!

అంబారిష్ వల్లే సినిమాల్లోకి వచ్చా, కానీ..: ‘‘10వ తరగతి చదుతున్న సమయంలో నాన్న చనిపోయారు. అమ్మ టీచర్ కాబట్టి ఆ జీతంతో ఇల్లు గడిచేది. కానీ, నాకు పెద్ద చదువులు చదవాలని ఆశ. సివిల్స్ చేసి గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకున్నాను. నాన్న చనిపోయిన తర్వాత కేవలం అంబారిష్ మాత్రమే మా ఇంటికి వచ్చి ఎలా ఉన్నారని పలకరించారు. ఆ సమయంలో ఆయన సినిమాల్లోకి రావాలని కోరారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టా. అంత గొప్ప నటుడి కుమార్తెను కాబట్టి ఇండస్ట్రీ గొప్పగా ఆహ్వానిస్తుందని భావించాను. కానీ, అక్కడ అలాంటి పరిస్థితి లేదు. మైసూర్ షూటింగ్ సమయంలో మా ఇంటికి వచ్చిన సెలబ్రిటీలు కనీస సాయం చేయలేదు. ఇండస్ట్రీలో వారి ప్రవర్తన భిన్నంగా ఉంది. సినిమాల్లో వచ్చే డబ్బుతో చదువుకొన్నాను. సివిల్స్‌లో విఫలమైన తర్వాత ఎంబీఏ చేద్దామని అనుకున్నా. డబ్బులు సరిపోవనే కారణంతో ఒక సంస్థలో హెచ్.ఆర్ టీమ్‌లో జాయిన్ అయ్యా. కానీ, ఆ రొటీన్ లైఫ్ బోరు కొట్టి మళ్లీ సినిమాలో నటించా. ఓ చిత్రం అనూహ్యంగా హిట్ కొట్టడంతో ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి’’ అని పవిత్ర వెల్లడించారు. 

Also Read: పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లి? అసలు నిజం ఇది

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
Jailer 2 Live Updates: 'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
Karthika Deepam 2 Serial Today October 15th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చచ్చిపోయింది? ఆ బాడీ జ్యోత్స్నదేనా! కుప్పకూలిపోయిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చచ్చిపోయింది? ఆ బాడీ జ్యోత్స్నదేనా! కుప్పకూలిపోయిన సూరజ్!
Brahmamudi Serial Today October 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం జరిగినట్టు లక్కీ బిల్డప్‌ - ఆఫీసులో స్టాప్‌ను తీసేసిన ఐశ్వర్య  
‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం జరిగినట్టు లక్కీ బిల్డప్‌ - ఆఫీసులో స్టాప్‌ను తీసేసిన ఐశ్వర్య  

వీడియోలు

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget