Vaisshnav Tej & Ketika Sharma: బటర్ ఫ్లై కిస్ చూశారు... ఇప్పుడు 'తెలుసా తెలుసా' వింటారా?
పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ మధ్య బటర్ ఫ్లై కిస్ చూశారు... ఇప్పుడు ఆ సినిమా 'రంగ రంగ వైభవంగా'లో 'తెలుసా... తెలుసా' పాట వింటారా?
![Vaisshnav Tej & Ketika Sharma: బటర్ ఫ్లై కిస్ చూశారు... ఇప్పుడు 'తెలుసా తెలుసా' వింటారా? Panja Vaisshnav Tej, Ketika Sharma starrer Ranga Ranga Vaibhavanga movie first single Telusa Telusa released Vaisshnav Tej & Ketika Sharma: బటర్ ఫ్లై కిస్ చూశారు... ఇప్పుడు 'తెలుసా తెలుసా' వింటారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/c520a4e3464153161199ce814b109773_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'ఉప్పెన'తో కథానాయకుడిగా పరిచయమైన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఇందులో ఆయనకు జోడీగా హీరోయిన్ కేతికా శర్మ నటించారు. గిరీశయ్య దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాట 'తెలుసా... తెలుసా'ను ఈ రోజు విడుదల చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్ ఆలపించారు. 'తెలుసా తెలుసా' విడుదల సందర్భంగా సినిమాలో రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్, రాధగా కేతికా శర్మ కనిపించనున్నారని చిత్రబృందం తెలియజేసింది. ఇద్దరూ మెడికల్ కాలేజీ విద్యార్థులు అనేది అర్థం అవుతోంది. సాంగ్ లిరికల్ వీడియో చూస్తే... చిన్నతనం నుంచి హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి పెరిగినట్టు అర్థం అవుతోంది. అలాగే, ఇద్దరి మధ్య చిన్నతనం నుంచి కోపాలు - గొడవలు ఉన్నట్టు సాహిత్యం ద్వారా చెప్పేశారు.
The journey of Rishi and Radha in a lovely tune, #TelusaTelusa❤️ from #RangaRangaVaibhavanga is out now!
— SVCC (@SVCCofficial) February 3, 2022
▶️https://t.co/WR7pWvOsOl
A Rockstar @ThisIsDSP Musical🎹
Directed by @GIREESAAYA#PanjaVaisshnavTej #Ketikasharma #RRVTheFilm @SVCCofficial @BvsnP @SonyMusicSouth pic.twitter.com/C0QbvPkPzk
వైష్ణవ్ తేజ్ తొలి సినిమా 'ఉప్పెన'కు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అందులో పాటలు అన్నీ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు 'రంగ రంగ వైభవంగా' నుంచి విడుదలైన 'తెలుసా తెలుసా' మెలోడీ ఆకట్టుకునేలా ఉంది. లవ్ స్టోరీ కాబట్టి దేవి శ్రీ మిగతా పాటలకూ మంచి బాణీలు అందించారని ఊహించవచ్చు.
ఆల్రెడీ 'రంగ రంగ వైభవంగా' సినిమా టీజర్ విడుదలైంది. అందులో హీరో హీరోయిన్ల మధ్య బటర్ ఫ్లై కిస్ కూడా ఫేమస్ అయ్యింది. 'ఏంటే! ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్' అని హీరో వైష్ణవ్ తేజ్ అడిగే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ కేతికా శర్మ 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకు రానక్కర్లేదు తెలుసా?' అని సమాధానం ఇస్తారు. 'అంటే బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు ఉన్నావ్' అని హీరో, ఆ తర్వాత 'నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా?' అని హీరోయిన్ అనడం... ఇద్దరి మధ్య ముద్దు చూపించి చూపించకుండా చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)