This Week Telugu Movies : రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' To హారర్ థ్రిల్లర్ 'జటాధర' - థియేటర్‌లో ఒకే రోజు 6 మూవీస్... ఈ వారం ఓటీటీ మూవీస్ వెబ్ సిరీస్‌ల లిస్ట్
Upcoming Telugu Movies : లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నుంచి సూపర్ హారర్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ వరకూ ఈ వారం మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

Upcoming Telugu Movies In Theaters OTT Releases In November First Week : నేషనల్ క్రష్ రష్మిక లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్' నుంచి తమిళ హీరో విష్ణు విశాల్ డబ్బింగ్ మూవీ 'ఆర్యన్' వరకూ లేటెస్ట్ మూవీస్ ఈ వారం థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు రీసెంట్ బ్లాక్ బస్టర్స్, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్'
నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్' ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో... అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో డిఫరెంట్ లుక్‌లో రష్మిక ఈ సినిమాలో కనిపించనున్నారు.
భయపెట్టే 'జటాధర'
గుప్త నిధులు... వాటికి కాపలాగా ఉండే పిశాచ బంధనాలు... డ్రీమ్స్ వెనుక ఉన్న సైన్స్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన రీసెంట్ సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ 'జటాధర'. సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి వెంకట కల్యాణ్ దర్శకత్వం వహించారు. సోనాక్షికి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. యాంకర్ ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్, రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 7న మూవీ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
కామెడీ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'
'మసూద' ఫేం తిరువీర్, 'కమిటీ కుర్రాళ్లు' ఫేం టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా... రోహన్ రాయ్, నరేంద్ర కీలక పాత్రలు పోషించారు. 7 పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అష్మితా రెడ్డి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.
తమిళ డబ్బింగ్ 'ఆర్యన్'
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఆర్యన్'. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ మూవీ గత వారం తమిళంలో రిలీజైంది. తెలుగు వెర్షన్ ఈ నెల 7న రిలీజ్ కానుంది. శ్రేష్ట్ మూవీస్ సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడు, మలయాళ 'హృదయం' ఫేం ప్రణవ్ నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' ఇప్పటికే మలయాళంలో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఈ నెల 7న రిలీజ్ కానుంది. శ్రీ స్రవంతి మూవీస్ అధినేత కిశోర్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయనున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన... సాత్విక్ వర్మ హీరోగా ప్రీతి నేహ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ 'ప్రేమిస్తున్నా'. భాను దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీ మూవీస్/ వెబ్ సిరీస్‌లు
- అమెజాన్ ప్రైమ్ వీడియో - హెడ్డా, హెజ్బిన్ హోటల్ (వెబ్ సిరీస్), కాంతార చాప్టర్ 1, రాబిన్ హుడ్
- నెట్ ఫ్లిక్స్ - ది అస్సెట్, అలీన్, బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్, ఇడ్లీ కొట్టు, ఇన్ వేవ్స్ అండ్ వార్, బారాముల్లా (నవంబర్ 7)
- జియో హాట్ స్టార్ - కొత్త లోక చాప్టర్ 1, మానా కీ హమ్ యార్ నహీ (వెబ్ సిరీస్), బ్యాడ్ గర్ల్ (నవంబర్ 4), ది ఫెంటాస్టిక్ (నవంబర్ 5)
- జీ5 - రంగ్‌బాజ్ ది బిహార్ చాప్టర్ మూవీ, భాయ్ తుజైపాయి (మరాఠీ), మారిగల్లు
- సన్ నెక్స్ట్ - బ్లాక్ మెయిల్
- సోనీలివ్ - మహారాణి (వెబ్ సిరీస్ - నవంబర్ 7)





















