OTT Hindi Movie: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన రాశి ఖన్నా మూవీ... ఎక్కడ చూడొచ్చంటే?
The Sabarmati Report OTT Streaming: విక్రాంత్ మస్సే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించిన 'ది సబర్మతి రిపోర్ట్' రిపోర్ట్ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. తెలుగులో ఆమె సినిమాలు చేయక చాలా కాలమే అవుతుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా వెబ్ సిరీస్ లతో పలకరిస్తుంది. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన హిందీ మూవీ 'ది సబర్మతి రిపోర్ట్' డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.
తెలుగులో 'ది సబర్మతి రిపోర్ట్' స్ట్రీమింగ్
'ది సబర్మతి రిపోర్ట్' మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రాంత్ మస్సే హీరోగా నటించారు. రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్లుగా కనిపించారు. ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. అయితే వివాదాస్పద అంశం కావడంతో 'ది సబర్మతి రిపోర్ట్' మూవీపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఈ మూవీకి చాలా అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా సెన్సార్ నుంచి ఎదురైన ఇబ్బందుల కారణంగా మేకర్స్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ చేశారు.
2002లో గుజరాత్ లోని గోద్రా రైల్వే స్టేషన్ దగ్గర సబర్మతి ఎక్స్ప్రెస్ కాలిపోయిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ మంటల్లో 59 మంది ప్రయాణికులు చనిపోవడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ఆధారంగానే 'ది సబర్మతి రిపోర్ట్' మూవీని పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దారు డైరెక్టర్ ధీరజ్ శర్మ. ఇప్పటిదాకా కేవలం హిందీలో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
ఏ ఓటిటిలో ఉందంటే?
'ది సబర్మతి రిపోర్ట్' మూవీ ప్రస్తుతం జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ గానే ఈ మూవీని హిందీలో ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే ఈ శుక్రవారం నుంచి 'ది సబర్మతి రిపోర్ట్' మూవీ తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా జీ5 అందుబాటులోకి తీసుకురావడం విశేషం. సమర్ కుమార్ ఓ న్యూస్ ఛానల్ లో జర్నలిస్టుగా వర్క్ చేస్తాడు. మహిక అనే అమ్మాయితో కలిసి గోద్రా దుర్ఘటనను కవరేజ్ చేయడానికి వెళ్ళగా, అక్కడ తను తెలుసుకున్న భయంకరమైన నిజాలను బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కానీ సదరు న్యూస్ ఛానల్ ఆ వార్తల్ని బయటకు రాకుండా కప్పి పుచ్చి, హీరోకి ఉద్యోగం లేకుండా చేస్తుంది. దీంతో తాగుడుకు బానిసైన హీరో లైఫ్ లోకి అమృత ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడి నుంచి స్టోరీలో కీలకమైన మలుపు చోటు చేసుకుంటుంది. అసలు ఈ అమృత ఎవరు? వీరిద్దరూ కలిసి గోద్రా ఘటన వెనుకున్న నిజాల్ని ఎలా బయట పెట్టారు? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే.
Also Read: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
రాశి ఖన్నా లైనప్
ప్రస్తుతం రాశి ఖన్నా కెరియర్ ను స్లో చేసింది. బాలీవుడ్ లో ఇప్పటి దాకా ఫర్జీ, రుద్ర, యోధ అనే వెబ్ సిరీస్లు చేసిన ఈ అమ్మడు తాజాగా 'ది సబర్మతి రిపోర్ట్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఆమె ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. ఆ మూవీలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి 'తెలుసు కదా' అనే టైటిల్ ని ఖరారు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

