The Pet Detective OTT : అనుపమ మలయాళ మూవీ 'ది పెట్ డిటెక్టివ్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
The Pet Detective OTT Platform : మలయాళీ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ 'ది పెట్ డిటెక్టివ్'. నెల రోజుల తర్వాత తెలుగులో ఓటీటీలోకి వచ్చింది.

Anupama Parameswaran's The Pet Detectiv Movie OTT Streaming : మలయాళీ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'ది పెట్ డిటెక్టివ్'. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'ది పెట్ డిటెక్టివ్' మూవీ ప్రముఖ ఓటీటీ 'Zee5'లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తొలుత హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కాగా ఇప్పుడు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించగా... ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. అనుపమతో పాటు వినయ్ ఫార్ట్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ప్రధాన పాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read : పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ - ఆ కామెంట్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రియాక్షన్
స్టోరీ ఏంటంటే?
'ది పెట్ డిటెక్టివ్' స్టోరీ విషయానికొస్తే జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్‌గా తన టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటాడు.అయితే, అతనికి అంతగా పెద్ద కేసులేవీ రావు. అదే టైంలో ఓ పెట్ డాగ్ మిస్సింగ్ కేసు వస్తుంది. దీన్ని సాల్వ్ చేయడానికి అంగీకరిస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, చిన్నారి మిస్సింగ్, మహిళ మిస్సింగ్, అరుదైన చేప... దీని వెనుక ఉన్న మెక్సికన్ మాఫియా డాన్ వంటివి వెలుగులోకి వస్తాయి.
ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. అసలు అనుపమకు డిటెక్టివ్‌కు సంబంధం ఏంటి? ఆ కేసును జోస్ ఎలా సాల్వ్ చేశాడు? డిటెక్టివ్‌గా తన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.




















