అన్వేషించండి

Best Horror Movies on OTT: పని కోసం వెళ్తే శారీరకంగా వాడుకుంటారు - ట్విస్టులతో పిచ్చెక్కించే థాయ్‌లాండ్ హర్రర్ మూవీ, క్లైమాక్స్ కేక అంతే!

పనిమనిషిగా వచ్చిన ఒక అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారింది. ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటీ? ఆమె పగ తీర్చుకోవటానికి సహాయం చేసిన అమ్మాయి ఎవరు? ఇలా అనేక ట్విస్టులతో, సస్పెన్స్ తో సాగే స్టోరీ The Maid.

The Maid (ది మెయిడ్) 2020లో విడుదలయిన సూపర్ నేచురల్ హార్రర్ ఫిల్మ్. పనిమనిషిగా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారింది. ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? ఆమెకు ప్రతీకారం తీర్చుకోవటానికి సహాయపడిన అమ్మాయి ఎవరు? ఆద్యంతం ట్విస్టులతో, వణుకుపుట్టించే విజువల్స్‌తో చివరి వరకు గ్రిప్పింగ్‌గా సాగే కథే The Maid.

ఇదీ కథ

అత్యంత ధనవంతులైన ఉమా, నిరాచ్ అనే భార్యాభర్తల ఇంట్లో ఒక డొమెస్టిక్ హెల్పర్ పనిచేస్తుంటుంది. ఆమె నిద్రపోయినపుడు ఒక కోతిబొమ్మ కలలోకి వచ్చి భయపెడుతుంది. ఆ తర్వాత రోజు చూస్తే, నిజంగానే ఆ బంగళాలో ఉన్న కోతిబొమ్మ ఆమెను భయపెడుతుంది. నిరాచ్, ఉమాల కూతురు నిడ్ ను రాత్రి పడుకోబెట్టి లైట్ ఆపగానే ఆ కోతిబొమ్మకు ప్రాణం వస్తుంది. ఆ పనిమనిషి సైకియాట్రిస్ట్ దగ్గర టీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. రోజురోజుకీ ఆ కోతిబొమ్మ టార్చర్ పెడుతుండటంతో ఇక ఆ ఇంట్లో పనిచేయలేనని యజమానులకు చెప్పేసి వెళ్లిపోతుంది. కొత్త పనిమనిషిని చూడమని డ్రైవర్‌కు చెప్తే, ఆ పాత హెల్పర్ స్థానంలోకి జాయ్ అనే అమ్మాయిని పనిమనిషిగా వస్తుంది. 

ఆ బంగళాలో ఉండే సీనియర్ డొమెస్టిక్ హెల్పర్.. జాయ్‌కు బంగళా మొత్తం చూపిస్తుంది. ఓనర్స్ కూతురైన నిడ్‌ను కూడా జాయ్‌కు పరిచయం చేస్తుంది. ఇక్కడ పనిమనుషులు ఎందుకు త్వరత్వరగా మారిపోతున్నారు అని జాయ్ అక్కడి డ్రైవర్‌ను అడుగుతుంది. అతను ఒక లుక్ ఇచ్చి ఏమీ చెప్పకుండా తన గది చూపించి వెళ్లిపోతాడు. జాయ్ తనకు ఎదురుగా అద్దంలోకి చూసినపుడు ఒక భయంకరమైన ఆకారం కనపడుతుంది. ఆ రాత్రి భయంభయంగా తన గదిలో నిద్రపోతుంది. 

మరుసటి రోజు రాత్రి జాయ్.. నిడ్‌ను నిద్రపుచ్చి, లైట్ ఆర్పగానే, ఒక మూలన దెయ్యం కనిపిస్తుంది. మళ్లీ లైట్ వేయగానే ఆ దెయ్యం మాయమవుతుంది. ఒకరోజు ఏదో వెతుకుతున్నట్టుగా నిరాచ్ గదిలోకి వెళ్ళేటప్పటికి ఒక ఫొటో కనిపిస్తుంది. ఆ ఫొటోలో నిరాచ్, ఉమాతో పాటూ ఇంకో అమ్మాయి ఉంటుంది. ఆ ఫొటోలోని అమ్మాయే దెయ్యంగా వచ్చి భయపెడుతుందని జాయ్ తెలుసుకుంటుంది. ఆ దెయ్యం నిడ్‌కు కూడా కనిపిస్తుంది. ఒకరోజు జాయ్ సీనియర్ హెల్పర్స్ తో కలిసి వెళ్లి ఉమాతో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి దెయ్యంగా వచ్చి మమ్మల్ని భయపెడుతోందని చెప్తుంది. ఉమా తనకేమి తెలియనట్లుగా, ఈమె కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసేది అని చెప్తుంది.

ఫ్లాష్ బ్యాక్ లో ఉమా, నిరాచ్‌ల రిలేషన్షిప్ అంత బాగా లేదని, ప్లాయ్ అనే ఆ పాత పని అమ్మాయి (ఫొటోలో అమ్మాయి) ఉమాకు శారీరకంగా దగ్గరయినట్టు చూపిస్తారు. ప్లాయ్ గురించి సీనియర్ హెల్పర్స్ అందర్నీ అడుగుతుంది జాయ్. ఆమె ఏడేళ్ల క్రితం ఇక్కడ పనిచేసేది. ఎందుకు మానేసిందో తమకు తెలియదని చెప్తారు అందరూ. ఒకరోజు తన గదిలో నిరాచ్ ఒంటరిగా ఉండి నన్ను క్షమించు అని ఏదో ఆకారంతో మాట్లాడుతూ ఉంటాడు. అది జాయ్ చూస్తుంది. (ట్రైలర్ తర్వాత మిగతా కథ ఉంది).

స్పాయిలర్ అలర్ట్ (ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే.. మిగతా పేరాలు చదవద్దు. ఈ మూవీ ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది)

 

మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, ప్లాయ్.. ఉమాతోనే కాకుండా నిరాచ్‌కు కూడా శారీరకంగా దగ్గరవుతుంది. అప్పుడు ప్లాయ్‌కు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ విషయం ఉమాకి తెలిసిపోతుంది. ప్లాయ్‌కు పుట్టిన బిడ్డను తమ బిడ్డగా అందరికీ పరిచయం చేస్తారు. అప్పుడు నిడ్.. ప్లాయ్ కూతురు అన్న విషయం తెలుస్తుంది. ఒకరోజు ప్లాయ్ జారిపడిపోతుంది. ఆమె తలకు దెబ్బతగులుంది. అది చూసి కూడా ఉమా కాపాడదు. ఆమె చనిపోయినట్లు చెబుతుంది. కానీ పాయ్ అప్పటికి బతికే ఉంటుంది. ఆమె చేతులు కూడా కదుపుతుంది. అయినా పట్టించుకోకుండా పాయ్‌ను మట్టిలో పూడ్చిపెడతాడు నిరాచ్.

ప్రస్తుతంలోకి వస్తే, ఆ ప్లాయ్ చెల్లెలే జాయ్ అని తెలుస్తుంది. ప్లాయ్ కనపడకపోవటంతో ఏం జరిగిందో తెలుసుకోవటానికి జాయ్ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత జాయ్ తన అక్క ప్లాయ్‌ను చంపినవారెవరో తెలుసుకొని పగతో రగిలిపోతూ ఒక్కొక్కర్ని ఎట్లా చంపుతుందనేది మిగిలిన కథ. ఈ సినిమా Netflix స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget