అన్వేషించండి

The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!

ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్ వచ్చేసింది. అయితే, ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు రెప్ప వేయకండి.. ధనుష్ సీన్ మిస్సైపోతారు.

హాలీవుడ్ మూవీలో మన స్టార్స్ నటిస్తున్నారంటే.. ఆ ఆసక్తే వేరు. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే మన అభిమాన నటుడిని అందులో వెతుక్కుంటాం. స్క్రీన్ మీద ప్రత్యక్షం కాగానే.. హమ్మయ్య అని అనుకుంటాం. ప్రస్తుతం తమిళ నటుడు ధనుష్ అభిమానులు కూడా అదే అనుకున్నారు. కానీ, ‘హమ్మయ్య’ అనుకొనేందుకు కూడా అవకాశం లేకుండా ధనుష్ ట్రైలర్‌లో కనిపించాడు. ఓ ఫైట్ సీన్‌లో తళుక్కున మెరిసి మాయమయ్యాడు. దీంతో అభిమానులు బాగా నిరాశకు గురవ్వుతున్నారు. కొందరైతే మీమ్స్, జోక్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. 

ధనుష్ తొలిసారి నటిస్తున్న హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’. ఈ సినిమా ట్రైలర్ కోసం ఆయన అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ధనుష్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ట్రైలర్‌ను షేర్ చేశాడు. అయితే, ఈ ట్రైలర్‌లో ధనుష్ కేవలం ఒక్క సెకన్ మాత్రమే కనిపించాడు. అయితే, ట్రైలర్ చివర్లో మాత్రం ఆయన పేరును వేసి.. అభిమానులకు కాస్త ఊరట ఇచ్చారు. ఈ చిత్రానికి రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. 

Also Read: ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

ఇందులో ర్యాన్ గోస్లింగ్.. కోర్ట్ జెంట్రీగా నటించాడు. ఈ కథ ‘సియెర్రా సిక్స్’ అనే కోడ్ నేమ్ చుట్టూ తిరుగుతుంది. తన ఏజెన్సీకి సంబంధించిన నేరపూరిత రహస్యాలను కనిపెట్టిన ఏజెంట్‌ను పట్టుకొనే టాస్క్‌ను ఓ కిరాయి హంతకుడికి అప్పగిస్తారు. ఈ సందర్భంగా వచ్చే పోరాట సన్నివేశాలు వాహ్ అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే, స్క్రీన్ టైమ్‌లో ఎక్కువ భాగం ర్యాన్, క్రిస్‌లకు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో ధనుష్ పాత్ర ఏమిటనేది పూర్తిగా తెలియరాలేదు. ట్రైలర్‌లో ఓ ఫైట్ సన్నివేశంలో మాత్రమే ధనుష్ కనిపిస్తాడు. కేవలం ఒక సెకన్ కనిపించి మెరుపు తీగలా మాయమవుతాడు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. 

Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

The Gray Man Trailer: 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dhanush (@dhanushkraja)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dhanush (@dhanushkraja)

టాప్ హెడ్ లైన్స్

Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Embed widget