అన్వేషించండి

Thangalaan OTT Streaming: అన్ని అడ్డంకులూ, వివాదాలు దాటుకుని ఓటీటీలోకి వచ్చిన విక్రమ్ 'తంగలాన్'... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

పా రంజిత్ తాజా చిత్రం ‘తంగలాన్’ థియేటర్ లో ఫర్వాలేదనిపించుకుంది. అయితే వివాదాల కారణంగా, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు బ్రేక్ పడింది. అన్ని అడ్డంకులనూ దాటుకొని ఎట్టకేలకు ఓటీటీలోకి విడుదలవుతోంది.

చియాన్ విక్రమ్ హీరోగా నటించి ‘తంగలాన్’ (Thangalaan) సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 19వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. బ్రిటీషర్ల పాలనలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల పై అణిచివేత, వారి జీవితాల్ని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు పా రంజిత్. తమిళ సినిమాల్లో సామాజిక అంశాలను టచ్ చేసే దర్శకుడిగా పా రంజిత్ (Pa Ranjith)కు ఓ ఇమేజ్ ఉంది. తంగలాన్ కథలోకి వెళితే... కోలారు బంగారు గనులను తవ్వి తీయడానికి బ్రిటీషు అధికారులు ఓ గిరిజిన తెగను వినియోగించుకుంటారు. కానీ ఆ బంగారం వెలికి తీయడానికి ‘ఆర్తి’ అనే శక్తి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. మరి చివరకు బంగారం ఎవరికి దక్కిందనేదే అసలైన కథ. ఇందులో గిరిజన నాయకుడిగా విక్రమ్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ‘శివపుత్రుడు’, ‘ఐ’ సినిమాల తర్వాత విక్రమ్ కు పెద్ద సవాల్ గా నిలిచిన  పాత్ర ఇది. ఈ సినిమా వల్ల గాయాల పాలయ్యారు కూడా.  పార్వతి, మాళవికా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడు. 19 శతాబ్దపు కథకు నాటి వాతావరణాన్ని తీసుకురావడంలో పా రంజిత్ సక్సెస్ అయ్యారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఆగస్టులో విడుదలైంది.

వివాదం తెచ్చిన చిక్కు
సాధారణంగా, ఈ సినిమా ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే, పా రంజిత్ సినిమాలంటే వివాదాల్నీ మోసుకొస్తాయి. మొదటి నుంచీ అంబేడ్కర్ భావజాలం స్ఫూర్తి తో సినిమాలు తీస్తూ ఉంటారు పా రంజిత్. రజినీకాంత్ ‘కబాలి’, ‘కాలా’, కార్తీ ‘మద్రాస్’ సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అందుకే ఆయన సినిమాలు యునానిమస్ గా హిట్ అయిన సందర్భాలు తక్కువ. విక్రమ్ ‘తంగలాన్’ ఆశించినంత ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా ఆయన వివాదాలను పట్టించుకోకుండా తన స్టయిల్లో సినిమాలు తీస్తూ ఉంటారు.  అయితే, విక్రమ్ తంగలాన్ ఓటీటీ రిలీజ్ కు ఆయన తీసిన కంటెంట్ అడ్డంకి గా మారింది. ఈ సినిమాలో హిందూ మతాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని మద్రాసు హైకోర్టులో  ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఓ రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగుందని పిటీషనర్ పేర్కొన్నారు.  సెన్సార్ సెర్టిఫికేషన్ పూర్తి అయ్యాక, థియేటర్లలో విడుదలైన సినిమాను ఓటీటీలో రిలీజ్ కాకుండా ఆపడం సమంజసం కాదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగుమం అయింది. డిసెంబరు 10వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో సైలెంట్ గా విడుదలైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.  

Also Read: RRR Documentary On Netflix : వైరల్ అవుతోన్న రాజమౌళి సినిమా అప్డేట్.. మహేశ్ బాబుతో కాదు, మళ్లీ ఆ స్టార్స్ కాంబినేషనే!

సిద్ధార్థ్ తో ‘చిన్నా’ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నారు విక్రమ్.  ‘వీర ధీర శూరన్ :పార్ట్ 2’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. మొదటగా ఈ సినిమా సీక్వెల్ ప్రారంభించారు. ఈ సినిమా విడుదలయ్యాక, ప్రీక్వెల్ పై దృష్టి పెడతారట. డిసెంబరు 9న విడుదలైన టీజర్ మంచి స్పందన అందుకుంటోంది. ఇందులో విక్రమ్ పూర్తిగా ఓ మాస్ రోల్ లో రా అండ్ రస్టిక్ గా కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన టీజర్ తో చెప్పేసింది చిత్ర యూనిట్. ఎస్.జె సూర్య ఇందులో పోలీసాఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు.  

Also Read: Kanguva OTT Release:  'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Andhra Pradesh Pension Scheme: ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
TDP Yanamala: తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
Mahesh Babu: 'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
Telangana Group 2 Exam Date: 'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
Embed widget