Thamma OTT : ఓటీటీలోకి రష్మిక హారర్ థ్రిల్లర్ 'థామా' - 2 భాషల్లో స్ట్రీమింగ్... చిన్న ట్విస్ట్ ఏంటంటే?
Thamma OTT Platform : రష్మిక రీసెంట్ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'థామా' సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అందుబాటులోకి రాగా చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.

Rashmika Mandanna's Thamma OTT Streaming : బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'థామా' ఓటీటీలోకి వచ్చేసింది. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతానికి రెంటెడ్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉచితంగా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మూవీకి ఆదిత్య సర్పోత్ధార్ దర్శకత్వం వహించగా... దినేశ్ విజన్ నిర్మించారు. ఆయుష్మాన్, రష్మికలతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, వరుణ్ ధావన్, ఆసిఫ్ ఖాన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.
Also Read : సమంత రెండో పెళ్లి - అన్ ఫాలో చేసిన పర్సనల్ స్టైలిష్ట్... షాకింగ్ క్యాప్షన్
స్టోరీ ఏంటంటే?
అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రోజు పర్వత ప్రాంతానికి న్యూస్ కవరేజీకి వెళ్తాడు. అక్కడ అతనిపై ఓ ఎలుగుబంటి దాడి చేసేందుకు యత్నించగా... తడ్కా (రష్మిక) కాపాడుతుంది. బేతాళ జాతికి చెందిన యువతి తడ్కా మనుషుల రక్తం తాగే అలవాటు ఉంటుంది. కొన్ని దివ్య శక్తులు కూడా ఉంటాయి. ఈ జాతి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ). అతను చేసిన తప్పు కారణంగా బేతాళ జాతి అతన్ని ఎన్నో ఏళ్లుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.
అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి వచ్చిన గోయల్‌ను ఆ జాతి వారు శిక్షించాలని చూడగా తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలో అతనిపై ఇష్టం ఏర్పడి జన జీవనంలోకి వస్తుంది. అసలు వీరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? అలోక్ బేతాళుడిలా మారాడా? బేతాళ జాతి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటి? యక్షాసన్ చేసిన తప్పు ఏంటి? అలోక్‌కు తడ్కా గతం గురించి తెలిసిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















