అన్వేషించండి

Thriller Movies On OTT: సరిగ్గా 6.15 గంటలకు ఓ వీడియో లింక్ ఓపెన్ చేస్తాడు, భార్యను అలా చూసి భర్త షాక్ - ఈ మూవీలో ట్విస్టులు అదుర్స్

Movie Suggestions: భర్తతో కలిసి హాలిడేకు వెళ్లిన భార్య చనిపోగానే.. ఆ భర్తే పోలీసులకు టార్గెట్ అయ్యాడు. కానీ ఆ భార్య చనిపోవడం వెనుక తన తండ్రి మాస్టర్ ప్లాన్ ఉందని ఎవరూ ఊహించలేకపోయారు.

Thriller Movies On OTT: తరువాత ఏం జరుగుతుంది, నెక్స్‌ట్ సీన్ ఏంటి అని ఆసక్తిగా చూడగలిగే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. థ్రిల్లింగ్ కథతో, ఎక్కువ క్యారెక్టర్లతో కన్‌ఫ్యూజన్ లేకుండా సినిమాలు తెరకెక్కించడం కష్టమైన విషయమే. అయినా కూడా అందులో సక్సెస్ అయ్యాడు దర్శకుడు గిల్లియెమ్ క్యానెట్. 2006లో తను తెరకెక్కించిన ‘టెల్ నో వన్’ (Tell No One) అనే ఫ్రెంచ్ సినిమా.. థ్రిల్లర్ మూవీస్ లిస్ట్‌లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. కథలోకి ముందుకు వెళ్తే తప్పా అసలు ఈ సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాదు.

కథ..

‘టెల్ నో వన్’ కథ విషయానికొస్తే.. అలెక్సాండర్ బెక్, మార్గోట్ చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అలా ఒకసారి వారి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడే గుర్తుతెలియని వ్యక్తులు వారిపై అటాక్ చేస్తారు. ఆ అటాక్‌లో మార్గోట్ చనిపోగా.. అలెక్స్ గాయాలతో కోమాలోకి వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ల తర్వాత ఒక చిల్డ్రన్ డాక్టర్‌గా పనిచేస్తుంటాడు అలెక్స్. మార్గోట్‌ను మర్చిపోలేక మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతాడు. సరిగ్గా తన పెళ్లిరోజుకు ఒకరోజు ముందు అలెక్స్‌కు ఒక మెయిల్ వస్తుంది. అందులో ఫలానా సమయానికి ఓపెన్ చేయమని ఒక లింక్ ఉంటుంది. అప్పుడే తనను, తన చెల్లెలు ఆన్నాను కలవడానికి ఒక పోలీస్ ఆఫీసర్.. వాళ్ల ఇంటికి వస్తాడు. వారి ఫార్మ్ హౌజ్‌లో పైప్‌లైన్ వేయడానికి తవ్వినప్పుడు రెండు శవాలు దొరికాయని, అందుకే దీనిపై విచారణ చేయాలని చెప్తాడు. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని అలెక్స్, ఆన్నా మాటిస్తారు.

పెళ్లిరోజున తనకు వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి చూడగా అది ఒక సీసీటీవీ లైవ్ ఫుటేజ్. ఆ ఫుటేజ్‌లో మార్గోట్‌ను చూసి అలెక్స్ ఆశ్చర్యపోతాడు. కానీ ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అతడికి తెలియదు. దీంతో అతడు మార్గోట్ తల్లిదండ్రులను కలుస్తాడు. కానీ సీసీటీవీలో మార్గోట్‌ను చూసిన విషయం వారికి చెప్పడు. మార్గోట్ చనిపోయిన సమయంలో తన తండ్రి మాత్రమే తన శవాన్ని గుర్తుపట్టి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. అదే విషయాన్ని మరోసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాడు అలెక్స్. కానీ అతడి ఫార్మ్ హౌజ్‌లో శవాలు దొరకడంతో ఆ రెండు హత్యలతో పాటు మార్గోట్ చనిపోవడానికి కూడా అలెక్సే కారణమని ఎరిక్ అనే పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తుంటాడు. అదే సమయంలో ఆ శవాల దగ్గర ఎరిక్‌కు ఒక బ్యాంక్ తాళంచెవి దొరుకుతుంది. అది ఓపెన్ చేసి చూడగా.. మార్గోట్‌ను ఎవరో అటాక్ చేసిన ఫోటోలతో పాటు ఒక గన్ ఉంటుంది.

అలెక్స్ మీద అనుమానంతో మార్గోట్ తల్లిదండ్రులను కూడా వెళ్లి కలుస్తాడు ఎరిక్. కానీ వాళ్లు మాత్రం తమ అల్లుడు చాలా మంచివాడని, తన మీద తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పేస్తారు. అదే సమయంలో తాను మార్గోట్ అంటూ తనను కలవమంటూ ప్లేస్, అడ్రస్ అలెక్స్ మెయిల్‌కు వస్తుంది. అలెక్స్ ప్రతీ కదలికను గమనిస్తూ ఉన్న బెర్నార్డ్ అనే రౌడీ.. తనను ఫాలో అవుతూ ఆ చోటుకి వెళ్తాడు. వాళ్లని గమనించిన మార్గోట్.. అలెక్స్‌ను కలవకుండా వెళ్లిపోతుంది. మార్గోట్ పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు గమనించిన ఎరిక్.. అసలు మార్గోట్ చనిపోలేదని ఆధారాలతో సహా అలెక్స్‌కు అందిస్తాడు. అంతే కాకుండా మార్గోట్ తండ్రే ఇదంతా చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అసలు మార్గోట్ బ్రతికున్నా కూడా ఎందుకు చనిపోయినట్టు నటిస్తోంది? ఇందులో నిజంగానే తన తండ్రి హస్తం ఉందా? తెలుసుకోవాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

ఎమోషన్స్ కూడా..

‘టెల్ నో వన్’ సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి. అయినా కూడా ప్రతీ పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఇస్తూ వెళ్లాడు దర్శకుడు. కేవలం దీనిని ఒక థ్రిల్లర్ మూవీలాగా మాత్రమే కాకుండా ఇందులో ఎమోషన్స్ కూడా యాడ్ చేశాడు. ప్రతీ సీన్‌లో కొత్త క్యారెక్టర్ కనిపించిన ప్రతీసారి అసలు వీళ్లు ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా సాగే ‘టెల్ నో వన్’ను చూడాలంటే యాపిల్ టీవీలో చూసేయొచ్చు. ఫ్రెంచ్ సినిమానే అయినా ఇది ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. అలాగే ఈ మూవీలో పలుచోట్ల న్యూడిటీ ఉంటుంది. కాబట్టి పిల్లలతో చూడొద్దు.

Also Read: గతం మరిచిన మహిళ, తానే భర్తనంటూ సైకో సంసారం - ఇందులో థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి గురూ.. ఫిదా అయిపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
BSNL Prepaid Plan: అత్యంత చవకైన ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్ - నెలకు రూ.100 కూడా లేదుగా!
అత్యంత చవకైన ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్ - నెలకు రూ.100 కూడా లేదుగా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
BSNL Prepaid Plan: అత్యంత చవకైన ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్ - నెలకు రూ.100 కూడా లేదుగా!
అత్యంత చవకైన ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్ - నెలకు రూ.100 కూడా లేదుగా!
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Embed widget