Miss Perfcect Teaser : 'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు - లావణ్య, అభిజీత్‌ల వెబ్ సీరిస్ టీజర్ చూశారా?
Miss Perfect Teaser : లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.
Miss Perfect Web Series Teaser : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకటిగా పేరుగాంచిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మధ్య సరికొత్త కంటెంట్ ని ఆడియన్స్ కి అందిస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లను మరోవైపు హారర్ తో పాటు డార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగే సిరీస్ లతో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మరో సరికొత్త సిరీస్ రాబోతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'మిస్ పర్ఫెక్ట్'. మెగా కోడలు లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ ని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. విశ్వక్ ఖండే రావు ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు,
ఈయన ఇంతకు ముందు నిత్యా మీనన్, సత్యదేవ్ కలిసి నటించిన 'స్కైలాబ్' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈసారి ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్ కామెడీగా ఈ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్‌లతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్ జానర్ తో ఉండబోతోంది. ఇక ఈరోజు ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకోవడంతోపాటు సిరీస్ పై ఆసక్తిని పెంచేసింది. ఇక టీజర్ విషయానికొస్తే.. "నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్ విషయం నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. థట్స్ యువర్ ప్రాబ్లమ్. పర్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఎలా అవుతుంది. ఒక సింగర్ దగ్గరికి వెళ్లి మాటల్లో చెప్పొచ్చుగా పాటలో ఎందుకు అంటారా?" అనే సంభాషణలతో ఈ టీజర్ మొదలవుతుంది.
ఈ సిరీస్‌లో లావణ్య దేనినైనా పర్ఫెక్ట్ గా ఉంచాలనే పాత్రలో కనిపించనుంది. ఆమె పొరుగింట్లో ఉండే కుర్రాడిగా అభిజీత్ సైతం ఇలాగే ప్రతి పని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాడు. వీళ్లిద్దరి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. త్వరలోనే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి వ్యక్తి ఇదే కావడంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి.
'మిస్ పర్ఫెక్ట్' లావణ్య త్రిపాఠికి రెండో వెబ్ సిరీస్. దీని కంటే ముందు 'జీ 5' ఓటీటీ కోసం 'పులి మేక' వెబ్ సిరీస్ చేసింది. ఇందులో పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టింది. ఆది సాయి కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా నటిస్తున్న మిస్ పర్ఫెక్ట్ సిరీస్‌లో లావణ్య కార్పొరేట్ బాస్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. మరి టీజర్ తో ఆసక్తిని పెంచేసిన ఈ సిరీస్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Also Read : ఒక్కటే మాట, ఫెంటాస్టిక్ - తరుణ్ ఆదర్శ్ 'హనుమాన్' రివ్యూ