అన్వేషించండి

Horror Movies On OTT: బస్సులో వెళ్తున్న అమ్మాయిలను సగానికి కట్ చేసేసే గాలి - అసలు ఆ శక్తి ఏమిటీ, ఆ సీన్స్ చూడటం కష్టమే!

Movie Suggestions: సరదాగా ఉండే స్కూల్ స్టూడెంట్.. చూస్తుండగానే తన ఫ్రెండ్స్ అందరినీ కోల్పోతుంది. ఎక్కడికి వెళ్లినా శవాలే. అలాంటి పరిస్థితి నుండి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది?

Best Horror Movies On OTT: సైన్స్ ఫిక్షన్ కథల్లో హారర్ ఎలిమెంట్స్ ఉండడం చాలా అరుదైన కాంబినేషన్. అలాంటి కాంబినేషన్‌లోని సినిమాలు కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయి. కానీ ఈ కాంబినేషన్‌లో సినిమాలు తెరకెక్కించినవారు చాలా తక్కువ. అందులో జపానీస్ భాషలోని ‘ట్యాగ్’ (Tag) చిత్రం కూడా ఒకటి. 2015లో విడుదలయిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ ప్లస్ హారర్ జోనర్‌కు సూట్ అయ్యే సినిమా. ఆ రెండు జోనర్లను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.

(First on ABP దేశం: వివిధ ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న ఎన్నో ఆసక్తికరమైన.. భిన్నమైన సినిమాలు, సీరిస్‌లను అందరి కంటే ముందు అందించేది ‘ఏబీపీ దేశం’ మాత్రమే. కాపీ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని పాఠకులకు మనవి.)

కథ..

‘ట్యాగ్’ కథ విషయానికొస్తే.. ఓపెన్ చేయగానే రెండు బస్సుల్లో కొందరు స్టూడెంట్స్.. ఒక ప్రాంతానికి వెళ్తుంటారు. వారంతా చాలా సరదాగా ఉండగా మిట్సుకా (రేనా ట్రిండెల్) డైరీ రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్.. తన చేతిలో నుంచి పెన్ లాక్కొని కింద పడేస్తుంది. ఆ పెన్‌ను తీసుకోవడానికి మిట్సుకా కిందకు ఒంగుతుంది. కానీ తను లేచి చూసేలోపే ఆ రెండు బస్సులు, అందులో ఉన్న స్టూడెంట్స్ అంతా సగానికి కట్ అయిపోయి ఉంటారు. అసలు మిట్సుకాకు ఏమీ అర్థం కాదు. దీంతో బస్ దిగి పారిపోతూ ఉంటుంది. తనను ఒక గాలి వెంటాడుతుంది. ఆ గాలి తాకిన ప్రతీ ఒక్కరు సగంలో కట్ అయిపోయి ఉంటారు. వారి నుంచి తప్పించుకొని ఒక స్కూల్‌కు వెళ్తుంది మిట్సుకా. అక్కడ తన ఫ్రెండ్స్ అంటూ కొందరు అమ్మాయిలు కలుస్తారు. కానీ వారెవరినీ మిట్సుకాను గుర్తుపట్టలేరు.

గాలిని చూసి మిట్సుకా భయపడుతుంటే తన ఫ్రెండ్ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వారంతా కలిసి టీచర్ చెప్తున్నా వినకుండా స్కూల్ బంక్ కొట్టి బయటికి వెళ్తారు. కాసేపటి తర్వాత తిరిగొస్తారు. అప్పుడే ఆ స్కూల్‌లోని టీచర్స్ అంతా గన్స్ తీసుకొని స్టూడెంట్స్‌ను చంపడానికి వెంటాడతారు. అందులో మిట్సుకా మాత్రమే తప్పించుకొని బయటపడుతుంది. ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ అద్దంలో తన రూపం చూసుకుంటే తనకు తానే డిఫరెంట్‌గా కనిపిస్తుంది మిట్సుకా. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్.. మిట్సుకా పెళ్లి అంటూ ఒక చర్చి దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ తన పెళ్లికూతురిగా రెడీ అయ్యి వెళ్లిన తర్వాత పెళ్లికొడుకు స్థానంలో ఒక బాక్స్‌లో నుంచి ఒక పందిని బయటికి తీసుకొస్తారు. దీంతో భయపడిన మిట్సుకా.. అక్కడ ఉన్న అందరినీ చంపి పారిపోతుంది.

పెళ్లికూతురు డ్రెస్‌లో పారిపోయి వచ్చిన మిట్సుకా.. సడెన్‌గా అద్దంలోకి చూస్తే వేరే డ్రెస్‌లో ఉంటుంది. అప్పుడే తన చుట్టూ కొంతమంది చేరి తను మంచి రన్నర్ అని రేస్ కోసం తనను సిద్ధం చేస్తారు. మిట్సుకా కూడా రేసులో బాగా పరిగెడుతుంది. అదే సమయంలో ఇంతకు ముందు తను ఫ్రెండ్స్ అనుకున్నవారంతా తనకు కనిపించడం మొదలవుతుంది. అదే సమయంలో తను ఒక చీకటి ప్రాంతంలోకి వెళ్తుంది. అక్కడ తనకు ఒక దారి కనిపిస్తుంది. అందులోకి వెళ్లగానే తను భవిష్యత్తులోకి వెళ్తుంది. దీంతో కళ్లు మూసుకొని ఆలోచించగానే అసలు తనకు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. ఇంతకీ మిట్సుకాకు ఏమైంది? ఎందుకిలా తన రూపాలు మారుతున్నాయి? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.

రక్తపాతం..

‘ట్యాగ్’లో హారర్ సీన్స్ చాలానే ఉంటాయి. కొన్ని సీన్స్‌లో రక్తపాతం చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చివరివరకు అసలు హీరోయిన్‌కు ఏమైంది? ఏం జరుగుతుంది అని అస్సలు రివీల్ చేయకుండా కథను ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు దర్శకుడు సియోన్ సోనో. రక్తపాతం ఎక్కువగా ఉన్న ఒక మంచి హారర్ మూవీని చూడాలనుకునేవారు యూట్యూబ్‌లో ఉన్న ‘ట్యాగ్’ను చూసేయొచ్చు. Tag 2015 అని సెర్చ్ చెయ్యండి.

Also Read: అమెరికా ప్రెసిడెంట్‌పై దాడి, ఇంటర్వ్యూ కోసం ప్రాణాలకు తెగించే జర్నలిస్టులు - ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘సివిల్ వార్’ స్టోరీ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget