Razakar OTT Release: రెండు రోజుల ముందే ఓటీటీలోకి అనసూయ వయోలెంట్ మూవీ... స్ట్రీమింగ్ కంటే 48 గంటల ముందే చూసే ఛాన్స్ వాళ్లకే
Razakar OTT Release : అనసూయ భరద్వాజ, బాబీ సింహా, ఇంద్రజ లీడ్ రోల్స్ పోషించిన 'రజాకార్' మూవీని 48 గంటల ముందుగానే చూసే అవకాశాన్ని ఇస్తోంది ఆహా. కానీ ఒక్క కండిషన్.

అనసూయ భరద్వాజ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రజాకార్' మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఇటీవల ప్రకటించారు. అయితే ఈ మూవీ ప్రకటించిన డేట్ కంటే రెండు రోజుల ముందే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. కానీ ఆ రెండు రోజుల ముందు ఈ మూవీని ఓటీటీలో కొంతమంది మాత్రమే చూడగలరు.
48 గంటల ముందే స్ట్రీమింగ్
'రజాకార్' మూవీ జనవరి 24న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను జనవరి 24 కంటే ముందే చూడొచ్చని ఆహా తాజాగా ప్రకటించింది. కానీ ఈ అవకాశం అందరికీ కాదు. కేవలం ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే. వాళ్ళు మాత్రమే 48 గంటల ముందు నుంచే 'రజాకార్' మూవీని ఆహాలో చూడొచ్చని ప్రకటించింది. అంటే జనవరి 22 నుంచి ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్న యూజర్స్ మిగతా వాళ్ళ కంటే ముందుగానే ఈ మూవీని చూడొచ్చన్నమాట.
History’s dark secrets come to light. Witness the gripping story of Razakar,
— ahavideoin (@ahavideoIN) January 16, 2025
Premiering January 24th, only on Aha and 48 hours early access for Aha Gold users.#Razakar Silent genocide of Hyderabad#GudurNarayanReddy#YataSatyanarayana #razakarmovie pic.twitter.com/6UnkrbajwH
'రజాకార్' సినిమా స్టోరీ
'రజాకార్' మూవీలో అనసూయ, ఇంద్రజ, వేదిక, బాబి సింహ, రాజ్ అర్జున్ లీడ్ రోల్స్ పోషించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికంటే ముందు రజాకార్లు సాగించిన మారణకాండను డైరెక్టర్ యాటా సత్యనారాయణ 'రజాకార్' సినిమా ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. ఈ మూవీ గత ఏడాది మార్చిలోనే థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే చరిత్రను వక్రీకరిస్తూ ఈ సినిమాను తీశారనే వివాదం నెలకొంది. దీంతో మూవీ రిలీజ్ ఆపాలంటూ కొంతమంది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు సినిమాలో హింస ఎక్కువగా ఉందన్న కారణంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ వివాదాల కారణంగా 'రజాకార్' మూవీ ఓటీటీలో అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. దాదాపు 10 నెలల తరువతా ఎట్టకేలకు 'రజాకార్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు.
ఇక స్టోరీ ఏంటంటే... స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒప్పుకోడు. ఇండిపెండెంట్ గానే రజాకార్ల సాయం తీసుకుని హైదరాబాద్ ను పరిపాలించాలని ఆయన కోరుకుంటాడు. ఈ క్రమంలోనే ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు హిందువులను ముస్లింలుగా మార్చే కుట్రలు చేస్తూ ఉంటారు. మరోవైపు నిజాం నవాబ్ తో పాటు అప్పటి ప్రధాని లాయక్ అలీ కూడా ఖాసీం రజ్వీకి సపోర్ట్ చేస్తాడు. దీంతో ఖాసిం మరింత రెచ్చిపోయి ఉర్దూ తప్ప మిగిలిన భాషలు మాట్లాడకూడదని రూల్స్ పెట్టడం దగ్గర నుంచి, పన్నుల పేరుతో ప్రజలను పీడించడం వంటివి చేస్తూ ఉంటాడు. దీంతో చాకలి ఐలమ్మ, శాంతమ్మ, రాజిరెడ్డి వంటి నాయకులు వాళ్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలు పెడతారు. ఆ పోరాటం ఎలా సాగింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్ల దురాగతలకు ఎలా అడ్డుకట్ట వేశారు? హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో వల్లభాయ్ పటేల్ ఏ విధంగా విలీనం చేశాడు? ఇందులో నెహ్రూ పాత్ర ఏంటి? అనేదే ఈ రజాకర్ మూవీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

