అన్వేషించండి

Prema Vimanam Movie Teaser : ఆ డౌట్స్ ఏంట్రా బాబు - మహేష్ విడుదల చేసిన 'ప్రేమ విమానం' టీజర్

'వెన్నెల' కిశోర్, అనసూయ, సంగీత్ శోభన్, శాన్వి మేఘన ప్రధాన తారలుగా రూపొందిన సినిమా 'ప్రేమ విమానం'. మహేష్ బాబు చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదలైంది.

'వెన్నెల' కిశోర్, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ప్రేమ విమానం'. జీ 5  ఓటీటీ కోసం రూపొందిన చిత్రమిది. ఇందులో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో హీరోగా నటించిన సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కథానాయకుడు. అతని సరసన 'పుష్పక విమానం' ఫేమ్ శాన్వీ మేఘన (Saanve Megghana) కథానాయికగా నటించారు.

టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు
నిఖిల్ 'కేశవ', అడివి శేష్ 'గూఢచారి', మాస్ మహారాజా 'రావణాసుర' సినిమాలను నిర్మించిన, నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'డెవిల్' సినిమా నిర్మిస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ, 'జీ 5' ఓటీటీతో కలిసి నిర్మించిన చిత్రమిది. అభిషేక్ నామా నిర్మాత. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?

'ప్రేమ విమానం' టీజర్ ఎలా ఉందంటే?
'ప్రేమ విమానం'లో ముఖ్యంగా రెండు కథలు ఉన్నాయి. ఒకటి... ఓ పల్లెటూరిలో ఇద్దరు చిన్నారులు విమానం ఎక్కాలని ఆశ పడటం! రెండు... ఓ యువ జంట ప్రేమకథ! ఆ రెండిటినీ దర్శకుడు బాగా చూపించారు.

ఓ ప‌ల్లెటూరులోని ఇద్ద‌రు చిన్నారులు కొండ ఎక్కినప్పుడు... ఆకాశంలో విమానం వెళుతూ ఉంటుంది. 'అరే మ‌నం కూడా విమానంలో పోదాం రా' అని ఓ చిన్నారి అంటాడు. ఆ తర్వాత విమానం అంత ఎత్తులో ఎలా ఎగురుతుందనే సందేహం వాళ్ళకు కలుగుతుంది. దాంతో పాటు ఇంకా బోలెడు సందేహాలు వస్తాయి. వాటిని తమ గూడెంలో ఉన్న వ్యక్తి (వెన్నెల కిశోర్)ను అడుగుతారు. తరచూ వాళ్ళు అడుగే సందేహాలకు విసుగు, చిరాకు వచ్చి ;విమానం కనిపెట్టిన రైట్స్ సోదరులకు కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకుని' అని అసహనం వ్యక్తం చేస్తారు 'వెన్నెల' కిశోర్.

సంగీత్ శోభన్, శాన్వి మేఘన ప్రేమకథకు వస్తే... 'నాలో నీకు ఏం ఇష్టం?' అని అమ్మాయి అడిగితే, 'చెవులు' అని సమాధానం ఇస్తాడు. చెవులు నచ్చడం ఏమిటి? ఆ తర్వాత అబ్బాయిని చాచిపెట్టి అమ్మాయి ఎందుకు కొట్టింది? విమానం ఎక్కాలని ఆశపడిన చిన్నారుల చేతికి గాన్ ఎలా వచ్చింది? వంటివి తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.

Also Read అల్లు అర్జున్ 'పుష్ప 2' సెట్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

'ప్రేమ విమానం' చిత్రానికి సంతోష్ కటా దర్శకత్వం వహించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి  కూర్పు : అమర్ రెడ్డి, కళా దర్శకత్వం : గంధి నడికుడికర్, సమర్పణ : దేవాన్ష్ నామా, నిర్మాత : అభిషేక్ పిక్చర్స్ & జీ5.


విశేషం ఏమిటంటే... 'జీ స్టూడియోస్' సంస్థ నిర్మిస్తున్న 'విమానం' సినిమాలోనూ అనసూయ కీలక పాత్ర చేశారు. అందులో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మీరా జాస్మిన్ ఇతర తారాగణం. ఆ సినిమా కథాంశం కూడా విమానం ఎక్కాలని ఓ చిన్నారి కలలు కనడం మీద ఉంటుంది. కథాంశం ఒక్కటే అయినా కథ, కథనాలు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget