Dance Ikon: టాలెంటెడ్ డాన్సర్స్ కోసం 'ఆహా' డాన్స్ ఐకాన్ - ఓంకార్ హోస్ట్ గా కొత్త షో!
'ఆహా'లో డాన్స్ ఐకాన్ అనే కొత్త షో మొదలుకానుంది. దీనికి ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడినా.. రా రా రమంటున్న రణరంగంలో సిద్దంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ అని ఈ మధ్య పాడినా.. డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే 'ఆహా', ఓక్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సమర్పిస్తున్న 'డాన్స్ ఐకాన్' అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డాన్స్ ఐకాన్ టైటిల్ ను గెలుచుకోండి.
జూన్ 22 నుండి ప్రారంభం కానున్న ఈ షోకి సంబంధించిన డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకు కొనసాగుతాయి. మీ వయస్సు 5 నుండి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. danceikon@oakentertainments.com అనే ఈమెయిల్ కు, 60 సెకండ్స్ మీ డాన్స్ వీడియోను మెయిల్ చేయండి.
ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ అయిన ఓంకార్ మాట్లాడుతూ.. "ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డాన్స్ షోస్ చేశాను.. కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కి సంబంధించిన కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలేలో చెబుతాం. అందుకే ఈ షో మీ కోసమే. మీరో డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షో పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















