Nadu Center Web Series OTT : 'టూరిస్ట్ ఫ్యామిలీ' హీరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Nadu Center Web Series OTT Platform : తమిళ హీరో శశికుమార్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన బాస్కెట్ బాల్ ప్రధానాంశంగా ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Sasikumar's Nadu Center OTT Streaming On Jio Hotstar : ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్‌తో ఆడియన్స్‌ను అలరించే తమిళ హీరో శశికుమార్ మరో డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ', 'ఫ్రీడమ్' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'నడు సెంటర్' అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో శశికుమార్ ఆడియన్స్ ముందుకు రానుండగా... ఇందులో బాస్కెట్ బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 'జీవితాల మధ్య డ్రిబుల్ అండ్ షూట్ ఆట ప్రారంభమవుతుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాళీ, మరాఠీ ఇలా 7 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌కు నరు నారయణన్ దర్శకత్వం వహించగా... శశికుమార్‌తో పాటు ఆశా శరత్, రెజీనా కసాండ్రా, తారా అమలా జోసెఫ్, ఢిల్లీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read : iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...





















